Movie News

పరుగులు పెట్టవయ్యా విశ్వంభరా

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఓటిటిలో వచ్చి అక్కడా కూడా రికార్డుల బూజు దులుపుతోంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చూపు విశ్వంభర వైపు వెళ్తోంది. విఎఫ్ఎక్స్ పనుల మీద ఏడాదికి పైగానే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మెగా ఫాంటసీ మూవీకి ఇప్పటిదాకా డేట్ ఖరారు కాలేదు.

కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీని ప్రస్తావన వచ్చినా చెప్పాల్సింది వంశీనే అంటూ ప్రమోద్ స్మార్ట్ గా తప్పించుకోవడం అనుమానాలను మరింత బలపరిచింది. దర్శకుడు వశిష్ఠ ఈ మధ్య బయట కనిపిస్తున్నాడు. ట్విట్టర్ స్పేస్ లో పాల్గొని అభిమానులతో కొన్ని కబుర్లు పంచుకున్నాడు. ఇక్కడి దాకా బాగానే ఉంది.

కానీ అసలు కబురు ఎవరు చెప్పడం లేదు. ఇన్ సైడ్ టాక్ అయితే ఇంకా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదట. అయినంత వరకు అవుట్ ఫుట్ చూసిన చిరంజీవి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో కొన్ని భాగాలకు మళ్ళీ వర్క్ చేయాల్సి రావొచ్చు.

అయితే గత ఏడాది ఘాటీ దెబ్బ గట్టిగా పడటంతో పాటు శర్వానంద్ బైకర్ వాయిదాలు యువి మీద ఆర్థికంగా ప్రభావం చూపించాయి. ఒకవేళ కపుల్ ఫ్రెండ్లీ హిట్టయినా మరీ మురిసిపోయేంత డబ్బులు వస్తాయా లేదానేది చెప్పలేం. ఫైనాన్షియల్ గా బైకర్ నుంచే ఎక్కుడ డబ్బులు రావాలి. అప్పటి దాకా విశ్వంభర పనులకు బ్రేక్ పడతాయా అంటే ఏమో అంటున్నాయి అంతర్గత వర్గాలు.

గతంలో ఇదే తరహా పరిస్థితి చిరంజీవి అంజి విషయంలో ఎదురుకున్నారు. అది ఏకంగా ఆరేళ్ళు ప్రొడక్షన్ లో ఉండి విపరీతమైన ఆర్థిక భారాన్ని మోసింది. కానీ విశ్వంభర అంత తీవ్రంగా లేదు కానీ ఆల్రెడీ రెండు సంవత్సరాలు దాటిపోయాయి కాబట్టి ఒకరకంగా దీన్ని డేంజర్ బెల్ గా భావించి డెడ్ లైన్ పెట్టుకుని వర్క్ చేయాలి.

మన శంకరవరప్రసాద్ గారుతో తన మార్కెట్ స్టామినా ఋజువు చేసుకున్న చిరంజీవి తన రాబోయే సినిమాల్లో రాజీ పడే ప్రసక్తే లేదంటూ అవుట్ ఫుట్ మీద దృష్టి పెడుతున్నారట. సో విశ్వంభర వేసవిలో రావడం కూడా అనుమానమే అంటున్నారు. అదే జరిగితే దసరా లేదా దీపావళికి షిఫ్ట్ అవ్వాలి.

This post was last modified on February 13, 2026 12:15 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

5 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

7 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago