సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడు. కానీ 40వ పడికి చేరువ అవుతున్నా ఇంకా అతను పెళ్లి పీటలు ఎక్కలేదు. గతంలో అతడికి వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ఇద్దరిలో ఎవరి గురించి చెప్పాడో కానీ.. ఒక హీరోయిన్‌తో బ్రేకప్‌కు యువ దర్శకుడు రామ్ అబ్బరాజునే కారణం అని తేజు తాజాగా ఒక ఈవెంట్లో చెప్పడం విశేషం.
సుహాస్ హీరోగా ‘హే భగవాన్’ అనే సినిమా రాబోతోంది. ఈ నెల 20న రిలీజయ్యే ఈ సినిమాకు గురువారం ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు తేజు, రామ్ అతిథులుగా హాజరయ్యారు. రామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రోజుల నుంచే తేజుకు అతడితో స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక హీరోయిన్‌తో బ్రేకప్‌కు రామ్ కారణం అంటూ స్టేజ్ మీద ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు తేజు.
తాను తేజుతో ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కలిసి పని చేసినట్లు రామ్ వెల్లడించగా.. తేజు దగ్గరికి వచ్చి మైక్ అందుకుని ‘‘నా లవ్ స్టోరీకి ప్రత్యక్ష సాక్షి వీడు’’ అని చెప్పాడు. తర్వాత రామ్ కొనసాగిస్తూ.. ‘‘అక్కడి వరకు ఓకే, బ్రేకప్‌కు కారణం నేను అనకుంటే చాలు’’ అన్నాడు.
తర్వాత తేజు మళ్లీ మైక్ తీసుకుని.. ‘‘నా బ్రేకప్‌కు కారణమే వీడు’’ అన్నాడు. రామ్ మళ్లీ మాట్లాడుతూ.. ‘‘ఆవిడ హీరోయిన్ అండీ. ఇద్దరం కలిసి చూశాం అంతే’’ అనడంతో నవ్వులు పూశాయి.
తర్వాత తేజు మళ్లీ మాట్లాడుతూ.. ‘‘ఆ హీరోయిన్ నా లవ్వండీ. కానీ వీడే దాన్ని బ్రేకప్ చేశాడు. మా ఇద్దరికీ ఆ భాష కూడా రాదు’’ అని చెప్పాడు. దీంతో తేజు, రామ్, ఒక హీరోయిన్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా నడిచిందా అని అందరూ షాకవుతున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates