Movie News

డబుల్ ధమాకా… శ్రీవిష్ణు ఎటు వైపు?

ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కావడం అరుదైన విషయం. ఎప్పుడో తొంభైవ దశకంలో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ ఇలా రిలీజ్ కాగా.. మళ్లీ చాలా ఏళ్లకు నేచురల్ స్టార్ నాని మూవీస్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండుసార్లూ ఒక సినిమా బాగా ఆడింది. ఇంకోటి దెబ్బ తింది. 

గత ఏడాది తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ చిత్రాలు డ్యూడ్, ఎల్ఐకే ఇలాగే దీపావళి పోటీకి సై అన్నాయి కానీ.. తర్వాత ‘డ్యూడ్’ మాత్రమే రిలీజైంది. ‘ఎల్ఐకే’ వెనక్కి వెళ్లిపోయింది. కాగా టాలీవుడ్లో మళ్లీ ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ హీరో శ్రీ విష్ణు కాగా.. క్లాష్‌కు రెడీ అవుతున్న తన సినిమాలు విష్ణు విన్యాసం, మృత్యుంజయ్.

‘విష్ణు విన్యాసం’ను ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతున్నట్లు చాలా ముందే ప్రకటించారు. ఐతే ఇప్పుడు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్ చేస్తూ ఆ చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇలా ఒకే రోజు రెండు సినిమాలు మీవి రిలీజవుతున్నాయి కదా.. దీన్ని ఎలా డీల్ చేస్తారు, ప్రమోషన్ సంగతేంటి అని అడిగితే శ్రీ విష్ణు స్పష్టంగా సమాధానం ఇవ్వలేకపోయాడు.

తన పుట్టిన రోజు ఫిబ్రవరి 29 అని.. ఈసారి లీఫ్ సంవత్సరం కాకపోవడంతో 28నే చేసుకుందాం అనుకుంటున్నానని.. ఆ రకంగా ఆ వీకెండ్ తనకు ప్రత్యేకం అని.. రెండు సినిమాల ప్రమోషన్ విషయంలో ఏం చేయాలో తనకూ క్లారిటీ లేదని.. ఎవరి సలహా అయినా తీసుకుంటానని చెప్పాడు. 

ఇలా ఒకే రోజు ఒక హీరో సినిమాలు రెండు రిలీజ్ కావడం రెంటికీ అంత మంచిది కాదు. అలాంటపుడు హీరోనే చొరవ తీసుకుని ఒకదాన్ని పక్కకు తప్పించాలి. కానీ శ్రీ విష్ణు మాత్రం తన చేతుల్లో ఏం లేదన్నట్లుగా మాట్లాడాడు.

అతడికి ‘విష్ణు విన్యాసం’ సినిమా మీద ఏమైనా ఆసక్తి లేదా.. ఆ సినిమా ఫిబ్రవరి 27న వస్తుందని తెలిసి కూడా లేటుగా రేసులోకి వచ్చిన ‘మృత్యుంజయ్’ సినిమాకు అదే డేట్ ప్రకటిస్తుంటే ఊరుకున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి అనుకున్నట్లే ఈ రెండు చిత్రాలూ ఒకే రోజు రిలీజవుతాయా.. లేదా మార్పులేమైనా ఉంటాయా అన్నది చూడాలి.

This post was last modified on February 12, 2026 4:20 pm

Share

Recent Posts

బిసి సెంటర్స్‌లో ‘రిపీట్’ కావడం లేదా

మొన్న శుక్రవారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ అంచనాలకు మించి హైదరాబాద్, ఓవర్సీస్ లో అదరగొడుతోంది. వసూళ్లు ఊహించిన…

4 hours ago

ఓమ్‌లో ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయో

టాక్ మిశ్రమంగా ఉన్నా ఓమ్ వసూళ్లు బాగున్నాయి. వీకెండ్ తర్వాత ఎంత శాతం డ్రాప్ ఉంటుందనేది రెండు రోజులు ఆగితే…

6 hours ago

భోగి మంటల్లో శత్రువుల దహనం

టాలీవుడ్ తెరమీద రక్తధారలు కొనసాగుతున్నాయి. హీరోలు మారుతున్నా వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కాసులు కురిపించే దిశగా ప్రేక్షకులు ముందుకు…

6 hours ago

యూపీ సీఎంలా పాలిస్తానంటున్న ఏపీ స్వామీజీ

ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ఓ స్వామీజీ కూడా ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా మడకశిర నియోజ‌క‌వ‌ర్గంలోని…

6 hours ago

జ‌గ‌న్ ప‌ట్టు.. ష‌ర్మిల పంతం.. ముదిరిన ప్యాలెస్ వివాదం!

త‌న కుమార్తె అంజ‌లి పెళ్లిని బెంగ‌ళూరులోని య‌ల‌హంక ప్యాలెస్‌లో చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పంతం ఒక‌వైపు..…

7 hours ago

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో `ప‌ట్టింపు` లేదు.. ఎవ‌రైనా పోటీ చేయండి: జ‌న‌సేన‌

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల కోలాహ‌లం జ‌రుగుతున్న క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి…

8 hours ago