Movie News

సౌండ్ లేదేంటి వరప్రసాద్ గారూ

మాములుగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఓటిటిలో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మంచి హడావిడి ఉంటుంది. కానీ మన శంకరవరప్రసాద్ నెల రోజులకే డిజిటల్ లో వచ్చినా దాని తాలూకు సౌండ్ సోషల్ ఆన్ లైన్లో పెద్దగా లేదు. థియేటర్లలో రిలీజైనప్పుడు మెగాస్టార్ గురించి, వసూళ్ల గురించి క్రమం తప్పకుండా ట్వీట్లు, ఎలివేషన్లు గుప్పించిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు సైలెంటయ్యారు.

వర్కింగ్ డేస్ లో పీక్ గా చెప్పుకునే బుధవారం ప్రీమియర్ చేయడం వల్ల రెస్పాన్స్ కొంచెం తక్కువగా ఉండొచ్చనేది ఒక విశ్లేషణ. ఆల్రెడీ పండగ టైంలో అత్యధిక శాతం చూసేశారు కాబట్టి మళ్ళీ అర్జెంట్ గా స్మార్ట్ స్క్రీన్ మీద చూడాలనే తాపత్రయం తగ్గిందేమో.

ఇప్పుడే కాదు గత నెల మన శంకరవరప్రసాద్ గారు మెయిన్ రిలీజ్ జరుపుకుంది కూడా సోమవారమే. వీకెండ్ అయ్యాక విడుదల చేయడంతో హౌస్ ఫుల్స్ భారీగా పడ్డా దానికొచ్చిన హిట్ టాక్ కు తగ్గట్టు మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ రాలేదు. పదహారు కోట్ల దూరంలో ఆగిపోయింది.

ఒకవేళ శుక్ర లేదా శనివారం వచ్చి ఉంటే లెక్క ఖచ్చితంగా వేరుగా ఉండేది. అంటే థియేటర్, ఓటిటి రెండింటిలోనూ వరప్రసాద్ రాంగ్ స్ట్రాటజీ పాటించాడు. హక్కులు కొన్న జీ5 సంస్థ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తోంది. హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో అభిమానుల సంబరాల్లో భాగం పంచుకుని దాన్ని పబ్లిసిటీ కోసం చక్కగా వాడుకుంటోంది.

డిజిటల్ లో వదిలేశాం కదా జనాలు వాళ్లే చూస్తారులే అని తేలికగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే హీరో ఎవరైనా వాళ్ళ కొత్త సినిమాలకు ఓటిటి రెస్పాన్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి తర్వాతి సినిమాల రేట్లు డిసైడ్ చేస్తారు. అందుకే దర్శక నిర్మాతలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

థియేటర్ లో ఇంకా ఆడుతుండగానే ఓటిటికి ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ లో అసంతృప్తి అయితే ఉంది. ఇంకో వారం పది రోజులు ఆగి ఉంటే మరో వీకెండ్ ప్లస్ అయ్యేదని, ఇప్పుడా అవకాశం లేదని ఫీలవుతున్నారు. వ్యూస్ కు సంబంధించిన లెక్కలు ఓటిటి చెప్పే దాకా క్లారిటీ రాదు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on February 11, 2026 8:06 pm

Share
Show comments
Published by
Kumar
Tags: MSG

Recent Posts

ఆఫీసులు సరే… థియేటర్లు దొరుకుతాయా?

తెలుగు సినిమాలకు మార్కెట్ పరంగా అతి పెద్ద ఏరియా అయిన నైజాంలో ఉన్నట్లుండి కొత్త కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు మొదలు కావడం…

50 minutes ago

సంక్రాంతి శుభాకాంక్షలతో నితిన్ రిస్కు ?

ఇంకా ఏడాది సమయం ఉండగానే టాలీవుడ్ సంక్రాంతి మీద విపరీతమైన హైప్ నెలకొంది. షూటింగులు మొదలుపెట్టకుండా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్,…

2 hours ago

డిజిటల్ కు దగ్గరైన మరో హీరో

ఇండియాలో వెబ్ సిరీస్‌లు చేయడంలో బాలీవుడ్ స్టార్లు ముందు నుంచి చురకే. ట్రెండును అందిపుచ్చుకుంటూ సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్,…

3 hours ago

లడ్డూ వివాదాన్ని కోర్టుకు వదిలేస్తేనే బెటరా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు…

3 hours ago

వైసీపీ మతాన్ని వాడుకుంటుందా? పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌లు, ఆ పార్టీ వ్య‌వ‌హారంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా రెండు…

3 hours ago

ట్రోలింగ్ ట్రోలింగే… వ్యూస్ వ్యూసే

‘బాహుబలి’తో ప్రభాస్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగాడో.. ఒకేసారి తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎన్ని రెట్లయిందో కొత్తగా చెప్పాల్సిన…

3 hours ago