ఇంకా ఏడాది సమయం ఉండగానే టాలీవుడ్ సంక్రాంతి మీద విపరీతమైన హైప్ నెలకొంది. షూటింగులు మొదలుపెట్టకుండా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున రావడం దాదాపు కన్ఫర్మ్ అయిపోగా తాజాగా మరికొందరు మిడ్ రేంజ్ హీరోలు ఆ స్లాట్ ని తీసుకునే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం విఐ ఆనంద్ తో ఒక సినిమా చేస్తున్న నితిన్ దీని తర్వాత ఆయ్ ఫేమ్ అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో నటించబోతున్నాడు. స్వంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వబోతున్నారు. ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. టైటిల్ ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అని రిజిస్టర్ చేయించారట.
పేరుకు తగ్గట్టు 2027 సంక్రాంతి సీజన్ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అయితే ఇక్కడో రిస్క్ ఉంది. నిజంగా నలుగురు సీనియర్లు కనక అదే సీజన్ లో వచ్చే పనైతే మార్కెట్ పరంగా నితిన్ కు కొంచెం ఇబ్బంది అవుతుంది.
అయితే తండ్రికి స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉండటం వల్ల థియేటర్లు దొరకొచ్చేమో కానీ అంత కాంపిటీషన్ లో నెగ్గాలంటే యునానిమస్ కంటెంట్ ఉండాలి. మొన్న నారి నారి నడుమ మురారికి వచ్చిన పాజిటివ్ టాక్ కు తగ్గట్టు వసూళ్లు నమోదు కాలేదు. ఎందుకంటే తగినన్ని స్క్రీన్లు దొరకలేదు. అయినా కూడా హిట్టు ముద్ర వేయించుకుంది. ఇలా ప్రతిసారి జరగదు.
ఇక్కడో విషయం గమినించాలి. టైటిల్ సంక్రాంతి శుభాకాంక్షలు అని పెట్టినంత మాత్రాన ఖచ్చితంగా అదే పండక్కు రావాలన్న రూల్ లేదు. 2005లో వెంకటేష్ సంక్రాంతి ఫిబ్రవరిలో వచ్చి ఘనవిజయం అందుకుంది. ఎస్వి కృష్ణారెడ్డి ఉగాది వచ్చింది అక్టోబర్లో. కళ్యాణ్ రామ్ విజయదశమి రిలీజైన నెల రోజుల తర్వాత దసరా వచ్చింది.
ఇలా చాలా ఉదాహరణలున్నాయి. మరి నితిన్ టీమ్ ఎం చేస్తుందో చూడాలి. ఆయ్ తరహాలో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతుంది కాబట్టి సంక్రాంతి మంచి ఆప్షనే కానీ ఏ మేరకు సాధ్యమవుతుందో వెయిట్ అండ్ సీ. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి.
This post was last modified on February 11, 2026 6:31 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…