మన శంకరవరప్రసాద్ గారుతో రీజనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహూ గారపాటి కొత్త సినిమా ‘క’ దర్శకులు సుజిత్ అండ్ సందీప్ తో లాకైనట్టు సమాచారం. కిరణ్ అబ్బవరంకి అదిరిపోయే థ్రిల్లర్ హిట్ ఇచ్చిన ఈ దర్శక ద్వయం తర్వాత మూవీ ఏంటనేది ఏడాదికి పైగా సస్పెన్స్ లో ఉంది.
పలువురు ప్రొడ్యూసర్లతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫైనల్ గా సాహూ చేతికి ఈ కాంబినేషన్ సాధ్యమైనట్టు తెలిసింది. ఉగాది పండక్కు ఓపెనింగ్ చేసి పూర్తి వివరాలను ప్రకటించబోతున్నారు. సంబరాల ఏటిగట్టు ఫినిషింగ్ లో ఉన్న సాయి దుర్గ తేజ్ తో ఈ క్రేజీ ప్రాజెక్టుని తెరకెక్కించబోతున్నారు. ఇక్కడో విశేషం ఉంది.
మావయ్యతో బ్లాక్ బస్టర్ తీసిన సాహూ గారపాటి ఇప్పుడు ఆయన మేనల్లుడితో జట్టు కట్టబోతున్నారు. చిరంజీవి, సాయి దుర్గ తేజ్ మధ్య ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. ఇది కూడా క తరహాలో థ్రిల్లర్ కాన్సెప్టట. కానీ దానికి కొనసాగింపు కాదని, పూర్తి వేరే కథతో ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో తీస్తారని వినికిడి.
సుజిత్ అండ్ సందీప్ లాంటి యువ దర్శకులు ఏడాదిన్నర పైగా టైం తీసుకోవడం చూస్తే కంటెంట్ ఏదో బలంగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. క్యాస్టింగ్ ఇంకో వారం పది రోజుల్లో కొలిక్కి తెచ్చి ఉగాది రోజు లాంచ్ చేస్తారని సమాచారం.
ఇది పక్కన పెడితే సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెజిఎఫ్ రేంజ్ లో హీరోయిజం, ఎలిమెంట్స్, ఎలివేషన్స్ ఇందులో ఉంటాయని, గతంలో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ చూడని ఒకసరికొత్త షేడ్ ని ఇందులో చూపించబోతున్నట్టు యూనిట్ న్యూస్.
ఆల్రెడీ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని వేసవికి విడుదల చేసి ఇప్పుడు సుజిత్ అండ్ సందీప్ కాంబోలో చేస్తున్న మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. చూడాలి మరి ఏం జరగనుందో.
This post was last modified on February 10, 2026 10:37 pm
గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…