Movie News

అనిల్ కౌంటర్ ఇచ్చాడండోయ్

గ‌త ఏడాది సంక్రాంతి పండ‌క్కి సంక్రాంతికి వ‌స్తున్నాంతో సెన్సేష‌నల్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఈ ఏడాది మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారుతో అంత‌కుమించి సంచ‌ల‌నం రేపాడు. భోళాశంక‌ర్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత చిరుకు ఇలాంటి హిట్టు ఇవ్వ‌డంతో అనిల్ పేరు మార్మోగింది. అత‌ను టాలీవుడ్లో హాట్ షాట్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు.

ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం మీద స‌ర్వ‌త్రా అమితాస‌క్తి నెల‌కొంది. ముందుగా దిల్ రాజు నిర్మాణంలో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా అనిల్ రావిపూడి సినిమా ఉండొచ్చ‌న్న సంకేతాలు వ‌చ్చాయి. ఐతే గ‌త కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా అప్‌డేట్స్ క‌నిపిస్తున్నాయి సోష‌ల్ మీడియాలో.

ఇందులో ఫాహ‌ద్ ఫాజిల్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడ‌ని.. అత‌డికి జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంద‌ని.. వెంకీ స‌ర‌స‌న పూజా హెగ్డే, కీర్తి సురేష్ హీరోయిన్ల‌ని.. ఈ సినిమా క‌థ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ వార్తలు వినిపించాయి.

ఈ ప్ర‌చారం రోజు రోజుకూ విస్తృతం అవుతుండ‌డంతో అనిల్ రావిపూడి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు. అత‌ను త‌న‌దైన శైలిలో ఫ‌న్నీగా ఒక పోస్టు పెట్టాడు. ”నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా. నటినటులు, కధ, టైటిల్ కూడా పెట్టేసారు. ఈ ఫ్లో చూస్తుంటే ..యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను.. అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో… నిజమైన పూర్తి వివరాలు… మీకు అందిస్తాం” అని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు.

ఇదంతా అనిల్ ప్లాన్ అని.. లీకులు ఇచ్చి ఇటువంటి కౌంటర్ పోస్టులు పెట్టడం ద్వారా ఎక్కువ బజ్ వస్తుందని ఇలానే స్ట్రాటజీ ఫాలో అవుతారని కొంత మంది సరదాగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఏదైనా అధికారికంగా వెలువడితేనే మంచిదని.. లేదంటే బజ్ పరంగా భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయనేది సినీ విశ్లేషకుల మాట.

త‌న కొత్త సినిమా గురించి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు పోస్ట్ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో మాట్లాడుతూ.. ఒక క్రేజీ ఐడియా వ‌చ్చింద‌ని, టైటిల్ కూడా వెరైటీగా ఉంటుంద‌ని.. దాని మీద వ‌ర్క్ చేయ‌బోతున్నాన‌ని చెప్పాడు అనిల్. ముందు అనిల్ నెక్స్ట్ మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం సీక్వెల్ అని ప్ర‌చారం జ‌రిగింది. కానీ కొత్త క‌థ‌తో అత‌ను వెళ్ల‌బోతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి అనిల్ త్వ‌ర‌లో ఏం అప్‌డేట్ ఇస్తాడో చూడాలి.

This post was last modified on February 10, 2026 9:23 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago