Movie News

ఆ సినిమా పేరులో అభ్యంతరం ఏముంది

మాములుగా సినిమాలో కంటెంట్ మీద సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ టైటిల్ మీద అబ్జెక్షన్ చెప్పడం అరుదుగా జరుగుతుంటుంది. చాలా సంవత్సరాల క్రితం నరేష్ నటించిన ఒక మూవీకి పోలీసోడి పెళ్ళాం అని పేరు పెట్టారు. దీంతో డిపార్ట్ మెంట్ నుంచి వ్యతిరేకత వచ్చింది.

ఏకవచనం పాటు వినడానికి ఇబ్బందిగా ఉందని దర్శక నిర్మాతల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అది కాస్తా పోలీస్ భార్యగా మారిపోయి సూపర్ హిట్ అందుకుంది. ఆ మధ్య విజయ్ తేరి డబ్బింగ్ కి పోలీసోడు అని పెట్టారు. మళ్ళీ అదే రిపీటయ్యింది. థియేటర్ రిలీజ్ టైంలో హక్కులు కొన్న దిల్ రాజు దాన్ని పోలీస్ గా మార్చారు.

తాజాగా కపుల్ ఫ్రెండ్లీ విషయంలోనూ అలాగే జరిగిందట. నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ పేరు మారిస్తే యు/ఏ ఇస్తామని చెప్పారని, కానీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయితే జరిగే డ్యామేజ్ ఎక్కువ కనక ఏ సర్టిఫికెట్ తీసుకున్నామని అన్నారు.

నిజానికి కపుల్ ఫ్రెండ్లీలో బూతు లేదు. ఫ్రెండ్లీ కపుల్ అని మారిస్తే కొంచెం బెటర్ గా అనిపించవచ్చేమో కానీ అపార్థం చేసుకోవాల్సిన డబుల్ మీనింగ్ రెండింటిలో లేదు. మరి ధీరజ్ అన్నట్టు నిజంగా కేవలం పేరుకే ఇచ్చారా లేక సినిమాలో ఉన్న కొన్ని లిప్ లాక్ సీన్లు, లవ్ ఎపిసోడ్లకు ఇచ్చారా అనేది ఫిబ్రవరి 14 థియేటర్లకు వచ్చాక తేలనుంది.

యువి సంస్థ నిర్మించిన కపుల్ ఫ్రెండ్లీ ప్రేమికుల రోజు విడుదల కానుంది. హీరో సంతోష్ శోభన్ దీని మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. తన ఫ్లాపుల ప్రవాహానికి బ్రేకులు వేస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైతే ప్రమోషనల్ కంటెంట్ యూత్ కి బాగానే రీచ్ అయినట్టు ఉంది. కాకపోతే అవసరమైన హైప్ ఇంకా పెరగాల్సి ఉంది.

పోటీలో విశ్వక్ సేన్ ఫంకీ, అర్జున్ డైరెక్ట్ చేసిన సీత పయనంతో పాటు రీ రిలీజులు మనసంతా నువ్వే, లవ్ స్టోరీ ఉన్నాయి. మరి కపుల్ ఫ్రెండ్లీ వీటిని ఎలా దాటుకుంటుందో చూడాలి. సినిమా మాత్రం కుటుంబం మొత్తం చూసే స్వచ్ఛమైన ప్రేమకథగా ఉంటుందని టీమ్ నొక్కి వక్కాణిస్తోంది.

This post was last modified on February 10, 2026 3:05 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago