Movie News

దృశ్యం-3 క్లైమాక్స్… వేరే లెవెలట

భారతీయ సినిమా చరిత్రలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో ఉంటుంది. ఈ మలయాళ చిత్రాన్ని ఇండియాలోని పలు భాషల్లోనే కాక విదేశీ భాషల్లో సైతం రీమేక్ చేశారంటే.. అదెంత పవర్ ఫుల్ మూవీనో అర్థం చేసుకోవచ్చు. ఏ భాషలో రీమేక్ చేసినా మంచి ఫలితాన్నే అందుకుంది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ నేరుగా ఓటీటీలో రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రాబోతోంది.

మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ ఆల్రెడీ ‘దృశ్యం-3’ షూట్ పూర్తి చేశాడు. ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందకు రాబోతోంది. ఐతే ఈ సినిమా మొదలైనపుడు.. ఇందులో ట్విస్టుల కంటే డ్రామా ఎక్కువ ఉంటుందని.. ఫ్రాంఛైజీలో తొలి రెండు చిత్రాల స్థాయిలో థ్రిల్స్‌ను ఊహించుకోవద్దని అన్నాడు జీతు జోసెఫ్. ఏదైనా సీక్వెల్ వస్తోందంటే.. ఇంకా హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ జీతు మాత్రం పనిగట్టుకుని అంచనాలను తగ్గిస్తున్నట్లు అనిపించింది.

ఐతే ఇప్పుడు జీతు వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడుతోంది ఆ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ఆశా శరత్. హీరో చేతిలో హత్యకు గురైన కుర్రాడి తల్లిగా, పోలీసాఫీసర్‌గా ‘దృశ్యం’ తొలి రెండు భాగాల్లో కీలక పాత్ర పోషించింది ఆశా. ఆమె ‘దృశ్యం-3’ క్లైమాక్స్ గురించి ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చింది.

‘‘దృశ్యం-3 క్లైమాక్స్ చూసి స్టన్ అయిపోతారు. ఇది నిజమా అని ఆశ్చర్యపోతారు. ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే సినిమా ఇది’’ అంటూ కొనియాడారు ఆశా శరత్.
సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నటి ఇలా చెబుతోందంటే ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ లాగే ‘దృశ్యం-3’ కూడా వేరే లెవెల్లోనే ఉంటుందని ఆశించవచ్చు.

ముందే అంచనాలు పెంచుకోవద్దనే జీతు జోసెఫ్ సినిమా మొదలవుతున్నపుడు అలా చెప్పి ఉండొచ్చు. ముందుగా మలయాళంలో రిలీజయ్యాక ‘దృశ్యం-3’ని హిందీ, తెలుగు భాషల్లోనూ రీమేక్ చేయనున్నారు. ఇంతకుముందులాగే హిందీలో అజయ్ దేవగణ్, తెలుగులో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్స్ చేస్తారు.

This post was last modified on February 9, 2026 12:06 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

13 minutes ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

2 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

2 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

4 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

5 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

5 hours ago