Movie News

యూఫోరియా మోతాదు తగ్గించి ఉంటే

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడిగా గుణశేఖర్ ఆ తర్వాత ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా ఆయనంటే మూవీ లవర్స్ కి ఇప్పటికీ గౌరవముంది. రుద్రమదేవికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడానికి కారణం అదే.

వరుడు డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గా కాక ఒక ఫిలిం మేకర్ గా ఆయనకు ఇచ్చిన రెస్పెక్ట్ గా చెప్పుకోవచ్చు. శాకుంతలంకు ఆర్థిక ఇబ్బందుల వల్ల బ్రేకులు పడితే నిర్మాత దిల్ రాజు రంగంలోకి ఎందుకు దిగారంటే దానికి రీజన్ గుణశేఖర్ అనే బ్రాండ్. అందుకే యూఫోరియా మీద అంతో ఇంతో సాఫ్ట్ కార్నర్ ఇటు పరిశ్రమలో అటు ప్రేక్షకుల్లో కనిపించింది.

అయితే వెబ్ సిరీస్ ల ప్రభావమో లేక ట్రెండ్ ఇలా ఉందనుకుని ప్రభావితం చెందిన వైనమో ఏమో కానీ గుణశేఖర్ ఇందులో తనకు సూటవ్వని జానర్ లోకి వెళ్లిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది.

జైల్లో ఉండే దారుణమైన పరిస్థితులను పచ్చిగా చూపించడం, డ్రగ్స్ కు బానిసైన యువకుడు కన్నతల్లి వరసను కూడా మర్చిపోవడం, టీనేజ్ వయసున్న కొడుకుని పెట్టుకుని ఒక మధ్యవయసు మహిళా తాగుబోతుగా మారడం ఇవన్నీ మరీ మోతాదు మించిపోయాయి. గౌతమ్ మీనన్ ఉన్న మానభంగం సీన్ రీ క్రియేషన్ అయితే మరీ టూ మచ్ అనిపించేసింది. ఇక్కడ చెప్పినవన్నీ సినిమాలో మైనస్ అయ్యాయి.

నిజానికి గుణశేఖర్ ఉద్దేశం మంచిదే. కానీ ఏదో నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ తీస్తున్నాననే తరహాలో ఇంత పచ్చిగా కొన్ని సీన్లు చూపించడం ఫ్యామిలీ ప్రేక్షకులను పూర్తిగా దూరం చేశాయి. యూత్ కూడా అంత పెయిన్ ని తెరమీద చూడలేక విత్ లవ్ కు వెళ్లిపోతున్నారు.

అందుకే యూఫోరియా కలెక్షన్లు తక్కువగా ఉండటం మాత్రమే కాక వీకెండ్ ని కూడా వాడుకోలేని వైనం కనిపిస్తోంది. ఓటిటిలో వచ్చాక జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుందో కానీ పైన చెప్పిన ఎపిసోడ్స్ తాలూకు మోతాదు తగ్గించి సెకండాఫ్ ని ఇంకోలా రాసుకుని ఉంటే యుఫొరియా ఖచ్చితంగా డీసెంట్ కంటెంట్ అయ్యేది. ఛాన్స్ మిస్ చేశారు. 

This post was last modified on February 8, 2026 10:24 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago