థియేటర్లు మూత పడ్డాక కొంత కాలానికి మొదలైన ఓటీటీల జోరు.. నిరాటంకంగా సాగుతూ వచ్చింది. అక్టోబరు మధ్య నుంచి దేశవ్యాప్తంగా థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు రాగా.. పూర్తి స్థాయిలో అయితే థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో ఓటీటీ హవా కొనసాగింది. నవంబరులో అయితే వివిధ భాషల్లో రికార్డు స్థాయిలో కొత్త చిత్రాలు ఓటీటీల్లో రిలీజయ్యాయి.
దక్షిణాది సినిమాల విషయానికి వస్తే.. సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) లాంటి భారీ చిత్రంతో పాటు మిస్ ఇండియా, మా వింత గాథ వినుమా, మిడిల్ క్లాస్ మెలోడీస్, అంధకారం లాంటి సినిమాలు నవంబరులో ప్రేక్షకులను పలకరించాయి. ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని.. డిసెంబరులోనూ కొత్త సినిమాలు సందడి చేస్తాయని ఆశించారు ప్రేక్షకులు. కానీ ఈ నెల మరీ నిస్సారంగా సాగిపోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యనే థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. కానీ వాటిలో ప్రదర్శించడానికి కాస్త పేరున్న సినిమాలు కూడా అందుబాటులో లేవు. హాలీవుడ్ మూవీ ‘టెనెట్’ మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏ సినిమా లేదు. అది కొన్ని రోజులు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. తర్వాత థియేటర్లు ఖాళీ. రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ జనాలను కనీస స్థాయిలో కూడా ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం థియేటర్లు వెలవెలబోతున్నాయి. మెయింటైనెన్స్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక షోలు ఆపేస్తున్నారు. ఈ సమయంలో ఓటీటీలు సైతం ప్రేక్షకుల గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ నెలలో ఓ ప్రముఖ ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు విడుదల కాలేదు. ‘డర్టీ హరి’ అంటూ ఎం.ఎస్.రాజు పే పర్ వ్యూ పద్ధతిలో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇది మినహాయిస్తే ఈ నెలలో ఓటీటీల్లో కాస్త పేరున్న సినిమా కూడా ఏదీ రిలీజ్ కావట్లేదు. క్రిస్మస్ సీజన్‌ను పురస్కరించుకుని కూడా కొత్త సినిమాలను ప్లాన్ చేయలేదు ఓటీటీలు. ఆ సమయానికి థియేటర్లలో సందడి పెంచడానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత డల్ సీజన్లో అది ఏమాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. మొత్తానికి ఈ నెలలో ఓటీటీలు వెలవెలబోతున్నాయి. థియేటర్లలో కూడా సందడి లేదు. ప్రేక్షకుల పరిస్థితి రెంటికీ చెడ్డట్లు తయారైంది.
This post was last modified on December 17, 2020 4:47 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…