సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా దర్శకుడిగా గొప్ప విజయాలు అందుకున్న వ్యక్తి ఈ మాట అనడం ఇంకా షాకింగ్. సొగసు చూడతరమా, బాల రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు లాంటి మరపురాని సినిమాలు తీసిన గుణశేఖర్ ఈ మాట అన్నాడు.
మళ్లీ జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతగా ఆయనకు ఏం విరక్తి వచ్చిందనే ప్రశ్న తలెత్తింది. ఆ కామెంట్ మీద గుణశేఖర్ తాజాగా వివరణ ఇచ్చాడు. ఇది విమర్శల వల్లో, నష్టాల వల్లో చేసిన కామెంట్ కాదని చెప్పాడు గుణ.
‘‘ట్రోలింగ్ అన్నది సమస్య కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఓ దర్శకుడు పడే ఒత్తిడి గురించి చెబుతూ ఆ మాట అన్నాను. దర్శకుడి కుర్చీలో కూర్చున్న ఎవ్వరికైనా ఒత్తిడి తప్పదు. ఏ పనిలో అయినా సంతృప్తి ఉంటుంది కానీ.. దర్శకులకు ఉండదని నా అభిప్రాయం. తృప్తి ఉంటే కంటి నిండా నిద్ర పడుతుంది. అలాంటి నిద్రను నేను 1992లో వదిలేశాను.
ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నా. వచ్చే జన్మలో అయినా హాయిగా నిద్ర పోవాలనే ఉద్దేశంతో మళ్లీ డైరెక్టర్‌గా పుట్టను అని అన్నాను’’ అని గుణశేఖర్ వివరించాడు. చాన్నాళ్లుగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ‘రుద్రమదేవి’తో ఆయన చేసిన సాహసం ఫలితాన్నిచ్చింది కానీ.. ‘శాకుంతలం’ దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘యుఫోరియా’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భూమిక, సారా అర్జున్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
This post was last modified on February 6, 2026 10:13 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…