Movie News

‘ఉప్పెన’ను ఓటీటీకి అమ్మారు.. కానీ!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేస్తున్న కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్. అతణ్ని హీరోగా పెట్టి మైత్రీ మూవీ మేకర్స్ ‘ఉప్పెన’ అనే ఆసక్తికర ప్రేమకథను రూపొందించింది. కృతి శెట్టి అనే కొత్తమ్మాయి అతడితో జోడీ కట్టింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడు. ఈ సినిమాను ఏప్రిల్ 2నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వచ్చి ప్రణాళికల్ని దెబ్బ తీసింది.

మధ్యలో ఓటీటీల్లో కొత్త చిత్రాలు రిలీజయ్యే ట్రెండ్ మొదలయ్యాక.. ‘ఉప్పెన’ ఆ మీడియంలోనే రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. మైత్రీ వాళ్లకు మంచి మంచి ఆఫర్లే వచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరోను ఓటీటీ ద్వారా అరంగేట్రం చేయించడం బాగుండదని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఎంత ఆలస్యమైనప్పటికీ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఫిక్సయిపోయారు. కానీ ఆ టైం ఎప్పుడొస్తుందో అర్థం కావడం లేదు.

ఇదిలా ఉండగా.. ‘ఉప్పెన’ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకు కొనుగోలు చేసినట్లు తాజా సమాచారం. అలాగని ఈ సినిమాను నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయడం లాంటిదేమీ జరగదట. ముందు థియేటర్లలోనే రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్‌లో రిలీజవుతుందట. పాత పద్ధతిలోనే థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెలా రెండు నెలల గ్యాప్‌లో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తెచ్చేలా డీల్ కుదిరిందట.

లాక్ డౌన్ టైంలో ఎడిటింగ్ మీద ఎడిటింగ్ చేసి సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారని.. స్యూర్ షాట్ హిట్ అయ్యే సినిమా ఇదని.. ఈ సినిమాలో కొత్తదనం నచ్చి నెట్ ఫ్లిక్స్ వాళ్లు మంచి రేటుతో డిజిటల్ రైట్స్ తీసుకున్నారని అంటున్నారు. కాలం కలిసొస్తే సంక్రాంతికి.. లేదంటే ఆ తర్వాత థియేటర్లు 100 పర్సంట్ నడిచే సమయంలోనే ‘ఉప్పెన’ను విడుదల చేయాలన్నది మైత్రీ వాళ్ల ప్లాన్. ఈ సినిమా రిలీజవకముందే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాను కూడా పూర్తి చేసేయడం విశేషం.

This post was last modified on December 17, 2020 4:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

12 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

13 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

16 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

16 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

17 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

17 hours ago