Movie News

శ్రీలీల.. సాయి పల్లవి.. ధనుష్ తో చిందేస్తే..!

ఈ తరం సౌత్ ఇండియన్ హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్ల జాబితా తీస్తే.. సాయిపల్లవి, శ్రీలీల ముందు వరుసలో నిలుస్తారు. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టమే. ఎవరికి వారు సూపర్ డ్యాన్సర్లే. ఫిదా, మారి-2, లవ్ స్టోరి, తండేల్ లాంటి చిత్రాల్లో అద్భుతమైన నృత్యాలతో ఆకట్టుకుంది సాయిపల్లవి. శ్రీలీలేమో.. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘పెళ్ళిసందడి’లోనే అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది. 

తర్వాత ప్రతి సినిమాలోనూ తన డ్యాన్సులతో కట్టిపడేస్తోంది శ్రీలీల. ‘కుర్చీ మడత పెట్టి’ పాటలో శ్రీలీల డ్యాన్స్ చూసి తన ఫ్యాన్ అయిపోయానని శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరో చెప్పడం విశేషం. ఇలా డ్యాన్సుల్లో ఎవరికి వారే సాటి అయిన సాయిపల్లవి, శ్రీలీల కలిసి.. ఒక పాటలో నృత్యం చేస్తే ఎలా ఉంటుంది? డ్యాన్స్ లవర్స్‌కు అంతకంటే పండుగ ఇంకేముంటుంది?

త్వరలోనే ఈ అరుదైన కలయికను చూసే అవకాశం కనిపిస్తోంది. సాయిపల్లవి, శ్రీలీల తొలిసారిగా ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్‌లో ‘అమరన్’ దర్శకుడు రామ్ కుమార్ పెరియస్వామి రూపొందించబోతున్న సినిమాకు వీళ్లిద్దరే కథానాయికలుగా ఎంపికయ్యారు.

ధనుష్, సాయిపల్లవి ఇంతకుముందే ‘మారి-2’ చిత్రంలో రౌడీ బేబీ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారనగానే ‘రౌడీ బేబీ’ని మించిన డ్యాన్స్ నంబర్ ఆశిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాకు శ్రీలీల కూడా తోడవడంతో ఈ ముగ్గురినీ కలిపి ఒక పాట పెడితే డ్యాన్స్ ఫ్లోర్ షేకైపోతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రామ్ కుమార్ ఎలాంటి కథ తీసినా.. నృత్యాల్లో సాయిపల్లవి, శ్రీలీలకు ఉన్న గుర్తింపు దృష్ట్యా ఆ ఇద్దరి మీద ఒక డ్యాన్స్ నంబర్ పెడితే మాత్రం ఆ పాట సినిమాకే అతి పెద్ద ఆకర్షణగా నిలవడం ఖాయం. ప్రమోషన్ల పరంగా కూడా అది బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు.

This post was last modified on February 4, 2026 12:26 pm

Share

Recent Posts

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

10 minutes ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

11 minutes ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

1 hour ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

5 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

6 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

10 hours ago