Movie News

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో ప్రొడక్షన్ తగ్గించారు. ఇప్పుడు తన వందో సినిమాతో పాటు అఖిల్ మూవీ ‘లెనిన్’ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే.. తమ సినిమాలను రిలీజ్ చేసుకోవడం.. లేదంటే వేరే భాష నుంచి వచ్చిన సినిమాలను మొత్తంగా తన సంస్థ చేతుల మీదుగా రిలీజ్ చేయడం తప్పితే.. వేరే పంపిణీ సంస్థల మాదిరి రెగ్యులర్‌గా డిస్ట్రిబ్యూట్ చేయదు అన్నపూర్ణ సంస్థ. 

కానీ ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్లో‌కి దిగుతుండడం విశేషం. నైజాం ఏరియాలో పంపిణీ విషయంలో కొన్ని సంస్థల ఏకఛత్రాధిపత్యం సాగుతుండడం.. ఇంతకుముందున్న అభిషేక్ అగర్వాల్, వరంగల్ శీను లాంటి వాళ్లు పూర్తిగా డిస్ట్రిబ్యూషన్‌కు దూరమైన నేపథ్యంలో కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ రావాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ సంస్థ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

మొదటగా నాగ్ సంస్థ ఈ నెల 13న రిలీజ్ కానున్న విశ్వక్సేన్ సినిమా ‘ఫంకీ’ని రిలీజ్ చేయబోతోంది. ఆ తర్వాత సొంత సంస్థలో తెరకెక్కుతున్న ‘డెకాయిట్’తో పాటు ‘లెనిన్’ చిత్రాన్ని కూడా అన్నపూర్ణ వారే డిస్ట్రిబ్యూట్ చేయబో్తున్నారు. వీటన్నింటినీ మించి ఒక క్రేజీ మూవీ అన్నపూర్ణ సంస్థ ద్వారా రిలీజ్ కాబోతోంది.

విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ను కూడా నాగార్జునే నైజాంలో రిలీజ్ చేస్తారట. ఇంకా ‘బేబీ’ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఎపిక్’తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య కొత్త చిత్రం ‘కరుప్పు’ను కూడా తెలుగులో అన్నపూర్ణ వేరే రిలీజ్ చేయనున్నారు.

నాగ్ ఇలా పూర్తి స్థాయిలో పంపిణీలోకి దిగడం.. ఒకేసారి అరడజను సినిమాల డీల్స్ ఓకే చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రధానంగా నైజాం డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న దిల్ రాజుకు షాకే అన్న డిస్కషన్ నడుస్తోంది. మరి నాగార్జునది ఆరంభ దూకుడేనా.. లేక మున్ముందు కూడా డిస్ట్రిబ్యూషన్లో ఇదే ఊపును చూపిస్తారా అన్నది ఆసక్తికరం.

This post was last modified on February 4, 2026 5:39 am

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

7 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

7 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

9 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

9 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

9 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

10 hours ago