బాలీవుడ్ హీరోయిన్లలో ప్రేమకథలు, బ్రేకప్‌లు లేని వాళ్లు అరుదుగా కనిపిస్తారు. అక్కడ పెద్దగా దాపరికాలు కూడా ఏమీ ఉండవు. ఎక్కువగా సినిమా వాళ్లతోనే రిలేషన్‌షిప్‌లోకి వెళ్లే హీరోయిన్లు.. వారితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంటారు. కొందరు తమ లవ్ స్టోరీలను దాచినా.. ఆ ప్రేమాయణం ముగిశాక దాని గురించి ఓపెన్ అవుతుంటారు.
సీతారామంతో తెలుగువారి మనసు దోచిన మృణాల్ ఠాకూర్ కూడా ఇప్పుడు తన పాస్ట్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు ఒక ప్రేమకథ ఉందని చెప్పిన మృణాల్.. అప్పటి తన బాయ్‌ఫ్రెండ్ఎవరు,. అతను సినీ రంగానికి చెందిన వ్యక్తా, మరొకరా అన్నది చెప్పలేదు. ఐతే తన బాయ్‌ఫ్రెండ్ తనను తట్టుకోలేక పారిపోయాడంటూ ఆమె కామెంట్ చేసింది.
”అతను పారిపోయాడు. నువ్వు మరీ దూకుడుగా ఉన్నావు. నేను నీతో డీల్ చేయలేను.. నువ్వు నటివి, నిన్ను నేను డీల్ చేయలేను అన్నట్లుగా కనిపించాడతను. అతను ఒక మంచి సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు. కాబట్టి తనను నేను అర్థం చేసుకున్నాను. అతణ్ని నిందించలేదు. అతడి పెంపకం అలా సాగింది. కానీ మేం కలిసి ఉండి రేప్పొద్దున మాకు పిల్లలు పుడితే.. నా పెంపకం తనలా ఉండదు. అప్పుడు పిల్లలు.. ఏంటిది అనుకుంటారు. అందుకే మేం విడిపోవడం మా మంచికే జరిగిందని అనుకుంటా” అని మృణాల్ పేర్కొంది.
సీతారామం తర్వాత తెలుగులోనే కాక ఏ భాషలోనూ సరైన విజయాన్ని అందుకోలేకపోయిన మృణాల్.. ఈ నెల 20న రిలీజయ్యే బాలీవుడ్ మూవీ దో దీవానా సెహర్ హైతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవి ఉద్యవర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మృణాల్‌కు జోడీగా సిద్ధాంత్ చతుర్వేది నటించాడు. తెలుగులో అడివి శేష్ సరసన మృణాల్ నటిస్తున్న డెకాయిట్ వచ్చే నెల 19న విడుదల కానుంది. దానిపై భారీ అంచనాలే ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా కథానాయికల్లోనూ మృణాల్ ఒకరు.
Gulte Telugu Telugu Political and Movie News Updates