మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని ఎవరైనా పొగుడుతారు. చిరు కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ పరోక్షంలో అడిగి మరీ ఒక నటుడి గురించి ప్రస్తావిస్తే.. తన ప్రతిభను కొనియాడితే.. దాని గురించి మూడో వ్యక్తి వచ్చి మరో వేదిక మీద చెబితే.. అది చాలా స్పెషల్.
నవీన్ పొలిశెట్టిని మెగాస్టార్ చిరంజీవి అలాగే పొగిడిన సంగతిని దర్శకుడు బాబీ కొల్లి వెల్లడించాడు.
సంక్రాంతికి చిరు మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది నవీన్ సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నటుడిగా సినిమాను తన భుజాల మీద మోయడమే కాక.. స్క్రిప్టులోనూ అతను కీలక పాత్ర పోషించాడు.
ఈ మధ్య తమ కలయికలో రానున్న కొత్త సినిమా చర్చల్లో భాగంగా చిరును కలిశానని.. ఆ సందర్భంగా చిరు మాట్లాడుతూ ‘‘అనగనగా ఒక రాజు సినిమా బాగుందట కదా. ఈ తరం నటుల్లో నాకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి’’ అని తనతో అన్నట్లు బాబీ వెల్లడించాడు. ఈ విషయం చెప్పినపుడు ఆడిటోరియం హోరెత్తింది. నవీన్ అమితానందానికి గురయ్యాడు.
తాను తరచుగా నవీన్‌తో మాట్లాడుతుంటానని.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత ఓ ప్రమాదంలో గాయాలైనా పట్టించుకోకుండా ‘అనగనగా ఒక రాజు’ కోసం కష్టపడ్డాడని.. ఆ కష్టానికి ఫలితమే ఈ సక్సెస్ అని అన్నాడు బాబీ.
మామూలుగా టైమ్ బాగుంటే హీరోలవుతారని.. టైమింగ్ బాగుండి హీరో అయిన నటుడు నవీన్ అని బాబీ కొనియాడాడు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి చిన్మయి ఘాట్రాజుతో కలిసి నవీనే స్క్రిప్టు అందించాడు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడైన మారి డైరెక్ట్ చేశాడు. నాగవంశీ నిర్మించగా.. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Megastar #Chiranjeevi about #NaveenPolishetty:
— Gulte (@GulteOfficial) January 30, 2026
" ఇప్పుడు ఉన్న Generation లో.. నాకు బాగా నచ్సిన Hero Naveen…" #AnaganagaOkaRaju pic.twitter.com/tMjiKRiZAB
Gulte Telugu Telugu Political and Movie News Updates