Movie News

అర‌వింద స‌మేత తరువాత బాధపడ్డ హీరోయిన్

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్యుత్త‌మమైన‌, విభిన్న‌మైన చిత్రాల్లో అర‌వింద స‌మేత ఒక‌టి. అందులో కీల‌క పాత్ర‌లు పోషించిన ఆర్టిస్టులంద‌రికీ మంచి పాత్ర‌లు ప‌డ్డాయి. పెర్ఫామెన్సులూ అదిరిపోతాయి. కానీ ఈషా రెబ్బాకు మాత్రం త్రివిక్ర‌మ్ అన్యాయం చేశాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి. ఆమె సెకండ్ హీరోయిన్ అయి ఉంటుంద‌ని ఆశిస్తే.. పెద్ద‌గా ప్రాధాన్యం లేని పాత్ర‌ను ఇచ్చాడు త్రివిక్ర‌మ్.

ఈషాకు పెర్ఫామ్ చేసే స్కోపే లేక‌పోయింది. ఈ పాత్ర విష‌యంలో ఇంత‌కుముందే ఈషా అసంతృప్తి వ్య‌క్తం చేసింది. తాజాగా త‌న కొత్త సినిమా ఓం శాంతి శాంతి శాంతిః ప్రమోష‌న్ల‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. అర‌వింద స‌మేత రిలీజ్ త‌ర్వాత త‌న పాత్ర విష‌యంలో వ‌చ్చిన స్పంద‌న చూసి బాధ ప‌డ్డ‌ట్లు వెల్ల‌డించింది ఈషా.

త్రివిక్ర‌మ్ సినిమాలు, వాటిలోని డైలాగ్స్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని..అర‌వింద స‌మేత క‌థ చెప్పినపుడు అందులో క‌చ్చితంగా న‌టించాల‌ని అనుకున్నాన‌ని ఈషా వెల్ల‌డించింది. ఐతే మొద‌ట్లో త‌న‌ది కూడా లీడ్ రోల్స్‌లో ఒక‌టి అనే చెప్పార‌ని ఆమె తెలిపింది. త‌న పాత్ర స్టీరియో టైప్ అవుతుందా అన్న భ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. రోజులు గ‌డిచేకొద్దీ ఆ భ‌యం పోయింద‌ని చెప్పింది. అర‌వింద స‌మేత‌ మేకింగ్ టైంలో.. అది పెద్ద సినిమా, పెద్ద ద‌ర్శ‌కుడు, పెద్ద నిర్మాణ సంస్థ కావ‌డంతో అంద‌రూ త‌న గురించి మాట్లాడుకునేవార‌ని.. అస‌లు తాను ఆ సినిమాలో ఉన్నానన్న‌ది నిజ‌మా కాదా అని న్యూస్‌లు ఇచ్చేవార‌ని ఆమె గుర్తు చేసుకుంది.

ఐతే సినిమా రిలీజ్ త‌ర్వాత చాలామంది ఫోన్ చేసి.. అన‌వ‌స‌రంగా ఈ పాత్ర చేశారు, ఏముంది ఇందులో అన‌డంతో తాను చాలా బాధ ప‌డ్డాన‌ని ఈషా చెప్పింది. నాకు క్యారెక్ట‌ర్లు చేయ‌డానికి ఇబ్బంది లేద‌ని.. కానీ అవి చేస్తూ పోతే, హీరోయిన్‌గా త‌న‌ను అంగీక‌రించ‌రేమో అని.. లీడ్ రోల్స్ చేయ‌డానికే ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు ఈషా తెలిపింది. మ‌ల‌యాళ హిట్ జ‌య జ‌య జ‌య జ‌య‌హేకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషాకు జోడీగా త‌రుణ్ భాస్క‌ర్ న‌టించాడు. సజీవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

This post was last modified on January 30, 2026 8:37 am

Share

Recent Posts

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

1 hour ago

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

2 hours ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

2 hours ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

2 hours ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

3 hours ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

3 hours ago