సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్‌బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన డిజాస్టర్లూ ఉన్నాయి. అందులో వరుడు అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ఇది డిజాస్టర్ అని తేలిపోయింది. ఆ సినిమాకు అతి పెద్ద మైనస్‌ల్లో ఒకటి హీరోయిన్ భానుశ్రీ మెహతా విషయంలో గుణశేఖర్ ఆడిన గేమ్ అని చెప్పొచ్చు.
సినిమా మొదలైన దగ్గర్నుంచి హీరోయిన్ ముఖం చూపించకుండా ఊరించి ఊరించి.. రిలీజ్ ముంగిట ఆమెను పరిచయం చేయగా, ఆమె అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశచెందారు. సినిమాలో హీరోయిన్ పాత్ర, లుక్స్ మరింతగా నిరాశపరిచాయి. ఈ విషయంలో తాను చేసిన తప్పు ఏంటో.. సినిమా రిలీజవ్వగానే తెలిసిపోయిందని గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
పెళ్లి మీద సినిమా, అందులో హీరో హీరోయిన్లు నేరుగా పెళ్లిపీటల మీదే ఒకరినొకరు చూసుకుంటారు అని చెప్పగానే వరుడు టీంలో అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారని.. ఇందుకు తగ్గట్లే ప్రేక్షకులకు కూడా హీరోయిన్ని నేరుగా సినిమాలో చూపిద్దామని తాను అనుకున్నానని గుణశేఖర్ తెలిపాడు. అందుకోసం హీరోయిన్ని దాచి పెడితే.. ఆ ప్రమోషనల్ ఐడియా బాగా వర్కవుట్ అయి ఆ అమ్మాయి విషయంలో తాను ఊహించని హైప్ వచ్చేసిందని గుణశేఖర్ తెలిపాడు.
ఆ హైప్ ఏ స్థాయికి వెళ్లిందో చెబుతూ.. కొందరు మినిస్టర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు తనకు, తన భార్యకు కాల్ చేసి ఎవరా హీరోయిన్ అని అడిగేవారని.. ఆమె కమల్ హాసన్ కూతురా అని కూడా వాకబు చేశారని గుణశేఖర్ వెల్లడించాడు. చివరికి ఈ హైప్ సినిమాకు మైనస్ అయిందని.. ఆ అమ్మాయి జనాలకు ఆనలేదని గుణ చెప్పాడు.
భాను శ్రీ మెహతా మామూలుగా చూస్తే బాగానే ఉంటుందని.. కానీ ఈ హైప్ వల్ల ఆమె జనాల అంచనాలను అందుకోలేకపోయిందని.. ఆమే కాదు, ఏ హీరోయిన్ అయినా జనాలకు ఆనేది కాదని గుణశేఖర్ అభిప్రాయపడ్డాడు. ముందు అనుకున్న అయిదు రోజుల పెళ్లి కాన్సెప్ట్ మీదే సినిమా తీసి ఉంటే బాగుండేదని.. సెకండాఫ్‌లో యాక్షన్ పార్ట్ పెట్టడం కూడా వరుడు సినిమాకు మైనస్ అయిందని గుణ చెప్పాడు.
This post was last modified on January 29, 2026 9:52 pm
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…