భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు ఆన్ లైన్ లో కూడా కోహ్లీకి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాదాపు 270 మిలియన్ల ఫాలోవర్లతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అందులో ఒక్క ప్రమోషన్ పోస్ట్ ఖరీదు కొన్ని కోట్లు అనడంలో ఎటువంటి అనుమానం లేదు.
ఐతే శుక్రవారం అర్ధరాత్రి ఈ అకౌంట్ మాయం కావడంతో ఫాన్స్ అందరూ ఆందోళన చెందారు. విరాట్ అకౌంట్ కి ఏమైంది? తానే అకౌంట్ ను డిలీట్ చేశాడా అంటూ ఫ్యాన్స్ గందరగోళం సృష్టించారు. ఒకవైపు అతని ట్విట్టర్ ఖాతా లోడ్ అవుతుండడం.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే లోడ్ అవ్వకపోవడంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు.
అక్కడితో ఆగకుండా విరాట్ భార్య, హీరోయిన్.. అనుష్క శర్మను ట్యాగ్ చేస్తూ, విరాట్ అకౌంట్ ఎందుకు కనిపించట్లేదు అని తనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. సోషల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఈ వార్త మారు మోగిపోయింది.
తీరా చూస్తే కొన్ని గంటలకే విరాట్ అకౌంట్ తిరిగి ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్షం అయ్యింది. దీంతో “అన్న తిరిగి వచ్చడ్రోయ్” అంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ ఆందోళన చూసి చాలామందికి అతిశయోక్తి కలగక మానదు. కానీ వారి ఆందోళనకు ఒక కారణం ఉంది. ఈ మధ్య కాలంలో వ్యక్తిగతంగా ఏమైనా పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు సోషల్ మీడియాలో అకౌంట్ లు డియాక్టివేట్ చెయ్యడం సెలబ్రిటీలకు ఒక అలవాటుగా మారిపోయింది.
మరోపక్క విరాట్ అకౌంట్ లో తమ వ్యాపార వాణిజ్యాలు ఉన్న సంస్థలు కూడా కాసేపు తీవ్ర ఆందోళనలు చెందాయి. కేవలం విరాట్ పోస్ట్ తో వ్యాపారాలు వేరే స్థాయికి వెళ్లిన దాఖలాలు ఎన్నో.
ఏదైతేనేం విరాట్ అకౌంట్ తిరిగిరావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇలాంటి వాటికి కూడా ఇంత గందరగోళం అవసరమా అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 30, 2026 9:13 am
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్‌డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్‌డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…