ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే. మాములుగా ఇలాంటి బ్లాక్ బస్టర్స్ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు. కానీ దురంధర్ విషయంలో అలాంటివి కనిపించడం లేదు.
అయినా సరే ఇవాళ మిడ్ నైట్ నుంచి నెట్ ఫ్లిక్స్ లో వచ్చేస్తుందని ముంబై మీడియా వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. థియేటర్ రిలీజ్ బ్యాన్ చేయడం వల్ల పాకిస్థాన్ లాంటి దేశంలో మిలియన్లలో పైరసీ వెర్షన్ చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటిటిలో ఒరిజినల్ హెచ్డి క్వాలిటీలో ఏ స్థాయిలో ఆదరిస్తారనే అంచనాలు భారీగా ఉన్నాయి.
అందరూ ఎదురు చూస్తున్న ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. దురంధర్ ఆన్ కట్ వెర్షన్ ని చూడొచ్చని మూవీ లవర్స్ ఆశిస్తున్నారు. మ్యూట్ చేసిన డైలాగులు వినిపించేలా పెట్టడం, సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సీన్లను మళ్ళీ పెట్టడం లాంటివి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అదే జరిగితే వ్యూస్ఊహించనంత స్థాయిలో భారీగా పెరుగుతాయి.
బాలీవుడ్ సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించిన దురంధర్ యాభై రోజుల తర్వాత బుల్లితెరపైకి వస్తోంది. మంచి నీళ్లు తాగినంత ఈజీగా వందల కోట్లు వసూలు చేశాక ఇప్పుడు అంతే స్థాయిలో ఓటిటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందా లేదానేది ఆసక్తికరంగా మారింది.
సమయాభావం, థియేటర్ల కొరత కారణంగా డబ్బింగ్ వెర్షన్ లో రాలేకపోయిన దురంధర్ ఇప్పుడు తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. పాకిస్థాన్ మాఫియా ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన దర్శకుడు ఆదిత్య ధార్ ప్రస్తుతం పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు.
విడుదలకు కేవలం 50 రోజుల సమయం మాత్రమే ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తున్నాడు. కాంపిటీషన్ ఎవరు ఉన్నా పట్టించుకోకుండా చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడానికి జియో స్టూడియోస్ నిర్ణయించుకుంది. పుష్పని మించిన ఓపెనింగ్స్, రెవిన్యూ రణ్వీర్ సింగ్ సినిమాకు చూడొచ్చని బయ్యర్లు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates