Movie News

ఉస్తాద్ వచ్చేదాకా ఊపు రాదా

సంక్రాంతి సినిమాల సందడి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మహా అయితే ఇంకో వారం బండి లాగొచ్చు కానీ ఆ తర్వాత సెలవు తీసుకోవాల్సిందే. చిరంజీవి ఒక్కరే ట్రెండింగ్ లో కొనసాగుతుండగా నవీన్, శర్వానంద్ తమ ఉనికిని చాటుకుంటూ ఓ మోస్తరు వసూళ్లతో నెట్టుకొస్తున్నారు. రవితేజ, ప్రభాస్ సెలవు తీసుకున్నారు.

జనవరి చివరి వారం, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కూడా ఏమంత చెప్పుకోదగ్గ చిత్రాల్లేవు. తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతిః, గుణశేఖర్ తీసిన యుఫొరియా, విశ్వక్ సేన్ ఫంకీ, యువి క్రియేషన్స్ కపుల్ ఫ్రెండ్లీ లాంటివి మూవీ లవర్స్ లో ఆసక్తి రేపుతున్నప్పటికీ ఇవేవి మాస్ టార్గెట్ చేసుకున్నవి కాకపోవడంతో థియేటర్ల దగ్గర భారీ రద్దీలను ఆశించలేం.

చూస్తుంటే మార్చి చివరి వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే దాకా బాక్సాఫీస్ కు పెద్ద ఊపు వచ్చేలా కనిపించడం లేదు. ఇది కూడా ఇంకా అఫీషియల్ కాలేదు. పెద్ది మార్చి 27 నుంచి తప్పుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఆ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ వెంటనే ఉస్తాద్ ని అదే డేట్ ని దించేలా ప్లానింగ్ చేసుకుందనే వార్తలు రెండు నెలల క్రితమే వచ్చాయి.

ఇప్పుడు రామ్ చరణ్ కనక తప్పుకునే పక్షంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారు. వారం ముందు దురంధర్ 2, టాక్సిక్ వస్తాయనే టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే మన శంకరవరప్రసాద్ గారులా ఉస్తాద్ టార్గెట్ కేవలం రీజనల్ మార్కెట్టే.

సో త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది. ప్యారడైజ్ కూడా తప్పుకోవడంతో మార్చి లాస్ట్ వీక్ మొత్తం ఓపెన్ గ్రౌండ్ అయిపోయింది. ఓజి సూపర్ హిట్, వరప్రసాద్ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీదున్న మెగా ఫ్యాన్స్ కి హ్యాట్రిక్ ఆనందం కలిగిస్తూ ఉస్తాద్ కూడా ఈ లిస్టులో చేరుతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.

నిన్నే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన దర్శకుడు హరీష్ శంకర్ ప్రమోషన్ల కోసం ప్రత్యేక ప్లాన్ లో ఉన్నారు. అన్నింటికి పవన్ కళ్యాణ్ హాజరు సాధ్యం కాదు కాబట్టి వీలైనంతగా క్రియేటివ్ పబ్లిసిటీ ఎలా చేయాలనే దాని మీద టీమ్ ఒక స్ట్రాటజీ సిద్ధం చేసిందట. డేట్ రాగానే ఇవి అమలవుతాయి.

This post was last modified on January 28, 2026 5:04 pm

Share

Recent Posts

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

3 minutes ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

8 minutes ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

4 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

4 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

4 hours ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

6 hours ago