‘శంబాల’కు ముందు ఆది సాయికుమార్ ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో ఆకట్టుకున్న అతడికి.. ఆ తర్వాత థియేట్రికల్ సక్సెస్ లేదు. కానీ అతడికి ఏ దశలోనూ అవకాశాలకు మాత్రం లోటు లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. అవేవీ థియేటర్లలో ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం భారీగా వ్యూస్ తెచ్చుకునేవి.
ఒక దశలో ఆది సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడమే గగనమైంది. నేరుగా కొన్ని చిత్రాలు ఓటీటీలోకే వెళ్లాయి. వాటికి కూడా వ్యూస్ బాగానే వచ్చేవి. థియేట్రికల్ మార్కెట్ జీరో అయినా సరే.. తన డిజిటల్ మార్కెట్‌కు మాత్రం ఢోకా లేకపోయింది. అక్కడ అలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడతను. తన సినిమాల డిజిటల్ హక్కులు మంచి రేటుకు అమ్ముడవుతూ వచ్చాయి. అంతగా అతడికి అక్కడ మార్కెట్ స్థిరపడింది.
ఐతే ఫ్లాప్ సినిమాలతోనే అంతగా వ్యూస్ తెచ్చుకునే హీరో.. థియేటర్లలో హిట్ కొడితే ఇక మామూలుగా ఉంటుందా? తన కొత్త చిత్రం ‘శంబాల’ క్రిస్మస్ కానుకగా విడుదలై సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి రూ.20 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. దీనికి ఆరంభం నుంచి భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రం 50 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది.
డిజిటల్‌గా రిలీజైన ఐదో రోజుకే 5 కోట్ల వ్యూస్ అంటే చిన్న విషయం కాదు. స్టార్ల సినిమాలకు మాత్రమే ఇలాంటి వ్యూయర్‌షిప్ వస్తుంటుంది.
జనం మాత్రం ఈ సినిమాను ఓటీటీలో బాగా చూస్తున్నారన్నది స్పష్టం. ‘శంబాల’ ఆది కెరీర్‌కు మంచి ఊపునిచ్చిన నేపథ్యంలో తన తర్వాతి సినిమాలకు మంచి బిజినెస్ జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on January 26, 2026 9:33 pm
ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగులకు సేవలు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్…
గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…
2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…
``నువ్వు కొంచెం గ్లామర్‌గా ఉండాలి. పంజాబీ డ్రస్.. నీకు బాగుంటుంది. చీరల సెలక్షన్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…
వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది.…