ఇండియాలో స్పోర్ట్స్ బయోపిక్స్‌కు మంచి డిమాండ్ ఉంటోంది కొన్నేళ్లుగా. బాగ్ మిల్కా బాగ్, మేరీకోమ్, ఎం.ఎస్.ధోని లాంటి సినిమాలు మంచి ఆదరణ సంపాదించుకున్నాయి ఈ కోవలో. ప్రస్తుతం వివిధ భాషల్లో స్పోర్ట్స్ బయోపిక్స్ చాలానే ప్రతిపాదనల దశలో ఉన్నాయి. సైనా, సింధు, సానియా లాంటి క్రీడాకారిణుల జీవితాల్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా దేశం గర్వించదగ్గ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథను తెరకెక్కించనున్నట్లు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఐతే ఆనంద్ పాత్రను పోషించేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం వెంటనే లభించలేదు. ఆనంద్ తమిళుడు కాబట్టి ఓ తమిళుడు అయితేనే ఈ పాత్రకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐతే ఇంకా బయటికి వెళ్లడించకపోయినప్పటికీ.. ఆనంద్ పాత్ర కోసం ఇప్పటికే ఆనంద్ ఎల్.రాయ్ ఓ నటుడిని ఓకే చేసేసినట్లు సమాచారం. ఆ నటుడెవరో కాదు.. తమిళ స్టార్ ధనుష్ అట. ఈ విలక్షణ నటుడిపై ఆనంద్ ఎల్.రాయ్‌కు మంచి గురే ఉంది. అతడిని హీరోగా పెట్టి హిందీలో ‘రాన్‌జానా’ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్‌లతో పాటు ధనుష్‌ను పెట్టి ‘ఆత్రంగి’ అనే బాలీవుడ్ మూవీ తీస్తున్నాడు. ధనుష్ అసాధారణ నటుడంటూ ప్రశంసలు కురిపించే ఆనంద్.. అతడినే విశ్వనాథన్ ఆనంద్ పాత్రకు ఓకే చేసినట్లు తెలుస్తోంది.
పాత్రకు తగ్గట్లు అవతారం మార్చుకుని, అద్భుతంగా నటించడంలో ధనుష్ ప్రత్యేకతే వేరు. ఆనంద్ రూపంలోకి రావడానికి అతను కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆనంద్ కొంచెం నిండైన మనిషిలా కనిపిస్తాడు. ధనుష్ మరీ బక్క పలచగా ఉంటాడు. కాబట్టి కొంచెం ఒళ్లు చేయాలి. చెస్ క్రీడాకారుడి మానసిక స్థితిని, హావభావాలను ఒడిసిపట్టుకోవాలి. మరి ఆనంద్ పాత్ర కోసం ధనుష్ ఎలాంటి మేకోవర్ సాధిస్తాడో చూడాలి.
This post was last modified on December 15, 2020 3:16 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…