Movie News

ఆమిర్ పెళ్లి చేసుకున్నట్లేనట

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్‌కు ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్ల‌వడం.. ఆ ఇద్దరి నుంచి విడాకులు తీసుకోవడం తెలిసిందే. ముందుగా త‌న చిన్న‌నాటి స్నేహితురాలు రీనా ద‌త్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోయాడు. కొన్నేళ్ల‌కు కిర‌ణ్ రావును పెళ్లాడిన అత‌ను.. ఆమె నుంచి కూడా నాలుగేళ్ల కింద‌ట విడాకులు తీసుకున్నాడు.

ఐతే 60వ పడిలో ఆయన కొత్తగా మరో బంధాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బంధం గురించి గత ఏడాది రూమర్లు వినిపిస్తున్న సమయంలో ఆమిరే స్వయంగా దాని గురించి ఓపెన్ అయిపోయాడు.

గత ఏడాది పుట్టిన రోజు సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన ఆమిర్.. తాను గౌరీ స్ప్రాట్ అనే బెంగ‌ళూరుకు చెందిన త‌న స్నేహితురాలితో ఏడాదిగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. గౌరీ త‌న‌కు 25 ఏళ్లుగా తెలుస‌ని.. ఆమె త‌న‌కు ఎప్పట్నుంచో మంచి స్నేహితురాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమిర్ చెప్పాడు.

గౌరీకి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్న సంగతి కూడా తనే వెల్లడించాడు. ఐతే గౌరీతో ఆమిర్ పెళ్లి ఎప్పుడా అని అందరూ ఎదురు చూడగా.. ఆ కబురు ఇంకా చెప్పట్లేదు ఆమిర్. ఐతే తాజాగా ఆమిర్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. గౌరీతో తనకు ఆల్రెడీ పెళ్లయిపోయినట్లే అని వ్యాఖ్యానించాడు.

‘‘గౌరీ, నేను ఒకరినొకరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా దృష్టిలో వివాహం అంటే రెండు మనసుల కలయిక. ఆ రకంగా చూస్తే మేం పెళ్లి చేసుకున్నట్లే. ప్రస్తుతం మేం కలిసే ఉంటున్నాం. ఈ వివాహాన్ని మేం అధికారికం చేయాలా వద్దా అన్నది భవిష్యత్తులో నిర్ణయించుకుంటాం’’ అని ఆమిర్ తెలిపాడు.

గౌరీకి బెంగళూరులో బ్యూటీపార్లర్స్ ఉన్నాయి. ఐతే ఆమె కొన్నేళ్లుగా ఆమిర్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పని చేస్తున్నారు. గత ఏడాది ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో పలకరించిన ఆమిర్.. ప్రస్తుతం తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏక్ దిన్’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

This post was last modified on January 22, 2026 4:20 pm

Share

Recent Posts

అంబానీల అద్భుత కార్యం

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుల జాబితాలో ఉండే ముకేష్‌ అంబానీ కుటుంబానికి ఇండియాలో అస‌లు పోటీయే లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వారి సంప‌ద…

34 minutes ago

జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…!

పులివెందుల‌లో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల పోలింగ్‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ప‌రాభ‌వాలు ఎదుర‌య్యాయి. ఆయ‌న అడుగు పెట్టీ పెట్ట‌డంతోనే…

2 hours ago

కిరాతకుడు హేమంత్ పై కాల్పులు – సంబరాల్లో ప్రజలు

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురించేసింది.…

2 hours ago

రేవంత్ రెడ్డి వానర సైన్యం

ప్ర‌ధాని మోడీ మెడ‌లు వంచుతామ‌ని.. ఆయ‌న‌ను గ‌ద్దె నుంచి దింపుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని…

3 hours ago

మళ్లీ శింబు-నయన్ జోడీ… నమ్మొచ్చా?

తమిళ సినిమాలో సెన్సేషనల్ జోడీ అంటే శింబు, నయనతారలదే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘వల్లభ’ అప్పట్లో పెను…

10 hours ago

టాప్ టెన్ ముఖ్యమంత్రుల్లో తెలుగు నేతలు

దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద తరుచుగా సర్వేలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణను బట్టి వారికి ర్యాంకులు…

11 hours ago