Movie News

స్టార్ తో చెడినా… క్రేజీ లైనప్‌తో డైరెక్టర్

కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సుందర్ సి ఈమధ్య కాలంలో కమర్షియల్ గా మంచి ట్రాక్ లో వెళుతున్నాడు. గతేడాది కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ 173వ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసినప్పటికీ ఎందుకో మళ్ళీ వెనక్కి తగ్గారు. రజినీ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఆయన కెరీర్ స్లో అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ సీన్ రివర్స్ అయ్యింది.

ప్రస్తుతం సుందర్ సి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నయనతార లీడ్ రోల్ చేస్తున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి సీక్వెల్) రిలీజ్‌కు రెడీ అవుతోంది. నయనతారను మళ్ళీ దేవతగా చూపిస్తూ సుందర్ సి తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు విశాల్‌తో ‘పురుషన్’ అనే పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌ను అనౌన్స్ చేసి టీజర్ కూడా వదిలారు. విశాల్ సుందర్ సి కాంబో అంటే మినిమం గ్యారెంటీ ఉండటంతో బిజినెస్ వర్గాల్లో దీనిపై మంచి బజ్ ఉంది.

మరోవైపు సుందర్ సి ఇప్పుడు స్టార్ హీరో కార్తీతో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే కార్తీకి కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే తన సక్సెస్ ఫుల్ హారర్ ఫ్రాంచైజీ ‘అరన్మనై 5’ కి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో అతనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున్నారు, ఇది బహుశా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

రజినీకాంత్ సినిమా చేజారినప్పటికీ, సుందర్ సి ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతుండటం విశేషం. ఒకవైపు నయనతార వంటి స్టార్ హీరోయిన్‌తో సోషియో ఫాంటసీ, మరోవైపు విశాల్, కార్తీలతో కమర్షియల్ యాక్షన్ సినిమాలు చేస్తూ తన రేంజ్‌ను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు. గతంలో ‘మద గజ రాజు’ సక్సెస్ కూడా ఆయనకు మంచి బూస్ట్ ఇచ్చింది.

This post was last modified on January 22, 2026 2:44 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Sundar C

Recent Posts

అఖండ 2, రాజాసాబ్… రెండిటిలో ఒకే తప్పు!

ఇటీవల వచ్చిన 'ది రాజా సాబ్', గత ఏడాది చివర్లో వచ్చిన 'అఖండ 2'.. రెండు సినిమాలు కూడా పక్కా…

9 minutes ago

బొమ్మల వివాదం తర్వాత కూడా మారని జగన్ వైఖరి

రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీ సర్వేపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఎరా ఎయ్యి పడితే ఆరాయితో…

13 minutes ago

చైతు లవ్ స్టోరీకి సరైన సమయం

నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ…

3 hours ago

ఆదర్శ కుటుంబం… ఎందుకీ సీక్రెట్?

విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం (AK47)' ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో…

3 hours ago

ఏపీలో వారికి సోషల్ మీడియా బ్యాన్?

సోషల్ మీడియా…రెండు వైపులా పదునున్న కత్తి. పిల్లల నుంచి పెద్దల వరకు టెక్ యుగంలో ఏదో ఒక సోషల్ మీడియా…

3 hours ago

రాజమౌళిని మెప్పించిన మందాకిని రక్తపాతం

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ట్రైలర్ వారం క్రితమే రిలీజయింది. బాలీవుడ్…

3 hours ago