టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వంద కోట్లు, రెండు వందల కోట్ల పోస్టర్ల హడావుడే కనిపిస్తోంది. సినిమా రిజల్ట్ కంటే బాక్సాఫీస్ అంకెలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ టైమ్‌లో, శర్వానంద్ రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు రియాల్టీని కుండబద్దలు కొట్టారు.
తన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ కి సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కలెక్షన్ల లెక్కల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదని, ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్‌ని కూడా ఆ అంకెలు అడగలేదని షాకింగ్ క్లారిటీ ఇచ్చారు.
శర్వా పాయింట్ ఏంటంటే.. సినిమా బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారు, అది హౌస్‌ఫుల్ బోర్డుల రూపంలో కనిపిస్తుంది. షోలు పెంచిన పది నిమిషాలకే టికెట్లు అయిపోతున్నప్పుడు, ఇక మనకి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ అంకెలు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని ఆయన ఫిక్స్ అయిపోయారు. “శతమానం భవతి సినిమా టైమ్‌లోనే ఐదారేళ్ల క్రితమే మేము వంద కోట్ల క్లబ్ చర్చలు పక్కన పెట్టేశాం” అని శర్వా అనడం ఇండస్ట్రీలోని అంకెల పిచ్చికి ఒక గట్టి కౌంటర్ అని చెప్పాలి.
నిజానికి ఇవాళ రేపు ప్రమోషన్స్ కోసం తప్పుడు లెక్కలు వేయడం.. లేదంటే ఉన్నదాని కంటే ఎక్కువ చూపించడం కామన్ అయిపోయింది. కానీ శర్వా మాత్రం కంటెంట్‌ను నమ్ముకుంటే చాలు, ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్సే అసలైన వసూళ్లు అని నమ్ముతున్నారు. జనాల్లో కనిపిస్తున్న ఆ పాజిటివ్ వైబ్ ముందు ఈ అంకెలు చాలా చిన్నవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో నేటి తరం హీరోలకు శర్వా ఒక కొత్త రూట్ చూపించినట్లయింది.
శర్వానంద్ రియాలిటీ అటిట్యూడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంకెలు ముఖ్యం కాదు, ఆడియన్స్ ఇచ్చే సాటిస్ఫ్యాక్షన్ ముఖ్యం అనే ఆయన ఫిలాసఫీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సంక్రాంతి రేసులో తన సినిమా క్లీన్ హిట్ అయినప్పటికీ, ఆయన ఎక్కడా ఓవర్ బిల్డప్ ఇవ్వకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఈ విషయాన్ని తేల్చేశారు.
This post was last modified on January 22, 2026 11:13 am
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.…
నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు. విధి నిర్వహణలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఇటు ప్రజల..అటు…
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి…
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…
రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…
మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…