యుత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక ముఖ్యమైన క్లారిటీ ఇచ్చారు. ఈ గ్యాంగ్‌లో ఒకరైన నటుడు సుశాంత్ రెడ్డి పార్ట్ 2లో భాగం కావడం లేదని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్ల సుశాంత్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని, ఇది తనను ఎంతో బాధించిందని తరుణ్ ఎమోషనల్ అయ్యారు.
సుశాంత్ లేడని తెలిసినప్పుడు తాను కొంత కాలం షాక్‌లోకి వెళ్ళానని, అసలు ఈ సినిమా చేయాలా వద్దా అని కూడా ఆలోచించినట్లు తరుణ్ చెప్పుకొచ్చారు. కేవలం డబ్బు కోసం సినిమా తీయడం తనకిష్టం లేదని, కథలో ఆ ఫ్రెండ్‌షిప్ వైబ్ పర్ఫెక్ట్‌గా కుదిరితేనే ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే స్క్రిప్ట్‌ను మళ్ళీ విశ్లేషించుకున్నాక, కార్తీక్ పాత్రను మరో కోణంలో చూపిస్తూ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు చెప్పారు.
సుశాంత్ ఈ ప్రయాణంలో లేకపోయినా, సినిమాలో కార్తీక్ పాత్ర మాత్రం ఉంటుందని తరుణ్ హింట్ ఇచ్చారు. బహుశా ఆ పాత్రను వేరే నటుడితో రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తోంది. “కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు, ద బాయ్స్ మళ్ళీ వస్తున్నారు” అంటూ ఆయన తన టీమ్ మీద ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతోందని, ఆడియన్స్ ఆశించే అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఒక స్నేహితుడు ఇచ్చే వెచ్చని కౌగిలింతలా చాలా నిజాయితీగా ఉంటుందని తరుణ్ ప్రామిస్ చేస్తున్నారు. సుశాంత్ లేని లోటు కనిపిస్తున్నా, తరుణ్ భాస్కర్ మేకింగ్ స్టైల్ మీద ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమాలోని ఆ ఎమోషనల్ క్యారెక్టర్ ను బ్యాలెన్స్ చేసే నటుడు ఎవరౌతారో చూడాలి.
This post was last modified on January 22, 2026 9:17 am
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి…
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…
రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…
మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…
మన శంకర వరప్రసాద్ గారుకి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి రెగ్యులర్ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చేశాయి. జిఓలో…
మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకంగా అమరావతి రాజధానికి…