Movie News

నమ్మకాన్ని సున్నా నుంచి సృష్టించుకోవాలి

ది రాజా సాబ్ విషయంలో కలిగిన అసంతృప్తిని ప్రభాస్ అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోయేలా లేరు. దర్శకుడు మారుతీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్రెష్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఎలివేషన్లు అన్నీ బయటికి తీసి కొత్తగా ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోయినా కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కనీసం యావరేజ్ అయినా ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు. కానీ డిజాస్టర్ తోనూ రెండు వందల కోట్లు వసూలు చేయగలిగే సత్తా ఉన్నా డార్లింగ్ ని వృథా చేసుకున్నారంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇదంతా గడిచిపోయిన గతం.

ఇప్పుడు మారుతీ తన మీద తగ్గిపోయిన నమ్మకాన్ని సున్నా నుంచి సృష్టించుకోవాలి. కేవలం ఒక ఫ్లాప్ తోనే ఎవరి క్యాలిబర్ ని అంచనా వేయలేం కానీ కంబ్యాక్ కి ఎలాంటి కథ అవసరమో ముందు దాన్ని గుర్తించాలి. మృగరాజు పోయాకే గుణశేఖర్ ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు.

అఖండకు ముందు బోయపాటి శీను తీసిన వినయ విధేయ రామ ఏమయ్యిందో చెప్పాల్సిన  పని లేదు. వివి వినాయక్ ట్రాక్ రికార్డు పట్టించుకుని ఉంటే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 వచ్చేది కాదు. ఇదేదో మారుతీని సమర్ధించే ప్రయత్నం కాదు. శూన్యం నుంచి వెలుగులోకి ఎలా వెళ్ళొచ్చో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

అసలు అనౌన్స్ మెంటే లేని వరుణ్ తేజ్ సినిమాని మారుతీ డైరెక్ట్ చేస్తున్నాడనే ప్రచారం కూడా గాసిప్పుల్లో నుంచి పుట్టిందే. రాజా సాబ్ వల్ల కలిగిన మరో సమస్య కలిగింది. సాహో లాగా హిందీ మార్కెట్స్ లో డీసెంట్ రెవిన్యూస్ వచ్చి ఉంటే డ్యామేజ్ తగ్గేది. కనీసం రాధే శ్యామ్ లాగా అక్కడక్కడా ఆడి ఉంటే ఓకే అనుకునే పరిస్థితి ఉండేది. కానీ అవేవి జరగలేదు.

సంక్రాంతికి కాంపిటీషన్ ఉన్నవన్నీ దెబ్బ తింటాయని భావిస్తే రివర్స్ లో అవే హిట్టయిపోయి రాజా సాబ్ బోల్తా కొట్టడం ఊహించని షాక్. త్వరలోనే కొత్త సినిమా ప్రకటన ఇస్తానని చెబుతున్న మారుతీ చిరంజీవి కోసం ఒక సబ్జెక్టు రాసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చూడాలి ఏం చేస్తారో.

This post was last modified on January 21, 2026 5:20 pm

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

53 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

1 hour ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

8 hours ago