Movie News

ఫంకీకి ఓపెన్ గ్రౌండ్… వాడుకోవడమే ఆలస్యం

జనవరిలో సంక్రాంతి సినిమాల హడావిడి తర్వాత చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో నెలాఖరు వరకు జనాలకు ఇతర ఆప్షన్లు పెద్దగా లేవు. చివరి వారంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి తప్ప వేరే నోటెడ్ మూవీస్ లేవు. అందుకే ఇప్పుడు ఫిబ్రవరి మీద అందరి దృష్టి వెళ్తోంది.

వాటిలో చెప్పుకోదగినది విశ్వక్ సేన్ ఫంకీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 13 రిలీజ్ ఉందంటూ ఇటీవలే పోస్టర్ ఒకటి ఆన్ లైన్ లో వదిలారు. సో వాయిదా ప్రసక్తే లేదు.

విశ్వక్ సేన్ కు ఫంకీ చాలా కీలకం. ఎందుకంటే గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో లైలా చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదురుకున్నాడు. కామెడీ పేరుతో ఒక పిచ్చి కంటెంట్ వదిలారని క్రిటిక్స్ గట్టిగా తలంటారు. ఆడియన్స్ రిజక్ట్ చేశారు. దీంతో బయట కనిపించడం కూడా మానేసి విశ్వక్ పూర్తిగా ఫంకీకే అంకింతమైపోయాడు.

సౌండ్ చేయకుండా లెగసి అనే మరో పొలిటికల్ థ్రిల్లర్ స్టార్ట్ చేసి దాన్ని కూడా సగానికి పైగా పూర్తి చేశాడు. ఏదైనా సరే సక్సెస్ కొట్టిన తర్వాతే బయటికి రావాలని డిసైడ్ అయిన విశ్వక్ దానికి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు విడుదల టైం వచ్చేసింది.

దర్శకుడు అనుదీప్ జాతిరత్నాలుతో సెన్సేషన్ సృష్టించాక శివ కార్తికేయన్ తో చేసిన ప్రిన్స్ చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత రవితేజతో సినిమా ఓకే అనుకున్న స్టేజి దగ్గర చేజారింది. అదే కథనే విశ్వక్ సేన్ తో ఫంకీగా తీశాడని ఇన్ సైడ్ టాక్.

ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో నిజ జీవిత దర్శకుడిగా విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ మూవీ మొత్తం ఫన్ జోన్ లోనే ఉంటుందట. అయితే రిలీజ్ కు కేవలం పాతిక రోజులు కూడా లేని నేపథ్యంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచాలి. మరుసటి రోజు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన సీత పయనం, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ రిలీజవుతున్నాయి. సో ఫంకీ త్వరగా క్రాంకీ మూడ్ లోకి వచ్చేయాలి.

This post was last modified on January 21, 2026 11:07 am

Share
Show comments
Published by
Kumar
Tags: funky

Recent Posts

శర్వా సంక్రాంతులు… ఏడాదిలో 4 సినిమాలు

నారి నారి నడుమ మురారి సక్సెస్ ని ఆస్వాదిస్తున్న శర్వానంద్ ముందులాగా గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. ప్రేక్షకులకు కంటిన్యూగా…

8 minutes ago

పాదయాత్రపై జగన్ అఫిషియల్ క్లారిటీ

మరో పాదయాత్రకు మాజీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. దీనిపై…

1 hour ago

మరో దావోస్ గా హైదరాబాద్?

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై…

2 hours ago

‘చనిపోయిన తర్వాత కూడా వదలవా…’ చిన్మయికి కౌంటర్!

కేరళలో జరిగిన దీపక్ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన…

3 hours ago

ఓటిటిల మీద తొంబై రోజుల ప్రభావం ఉంటుందా

తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు నిర్మాతల్లోనే కాదు వివిధ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిర్మాతలు తొంభై…

3 hours ago

బీఆర్ఎస్ ఎమ్మెల్యే vs కాంగ్రెస్ ఎంపీ.. అసలేం జరిగింది?

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ…

4 hours ago