Movie News

అన్నగారు ఇక రానట్టేనా ?

హిట్టు ఫ్లాపు పక్కనపెడితే కార్తీకి తెలుగులోనూ మార్కెట్ ఉంది. అందుకే హిట్ 3 ది థర్డ్ కేస్ లో దర్శకుడు శైలేష్ కొలను తనతో క్యామియో చేయించి నాలుగో భాగానికి హింట్ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న కార్తీ కొత్త మూవీ వా వతియార్ ఇటీవలే తమిళంలో విడుదలయ్యింది.

ఆర్ధిక వివాదాల వల్ల కోర్టు జోక్యం చేసుకోవడంతో పలుమార్లు పోస్ట్ పోన్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత నెల డిసెంబర్ లో విడుదలనుకున్నప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ అన్నగారు వస్తారు ట్రైలర్ లాంచ్, ప్రమోషన్లు అన్నీ చేశారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాక ఆగిపోయింది.

ఇప్పుడు వా వతియార్ ఫలితం వచ్చేసింది. కార్తీ డిజాస్టర్స్ టాప్ త్రీ చోటు దక్కించుకోవడం ఖాయమనేలా వసూళ్లు తేలిపోయాయి. జన నాయకుడు వాయిదాని వాడుకుందామని చూసిన టీమ్ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఎంజిఆర్ సెంటిమెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్, కార్తీ మ్యానరిజం ఇవేవి బొమ్మను కాపాడలేకపోయాయి.

సంతోష్ నారాయణన్ సంగీతం కూడా అంతంత మాత్రమే కావడంతో జనాన్ని మెప్పించడంలో దర్శకుడు నలన్ కుమారస్వామి విఫలమయ్యాడు. హీరోయిన్ కృతి శెట్టి ఏమంత ప్లస్ కాలేకపోయింది. ఓవరాల్ గా అసలు పోటీయే కాదనుకున్న జీవా సినిమా హిట్టవ్వగా కార్తీకి రివర్స్ అయ్యింది.

ఇప్పుడు అన్నగారు వస్తారు తెలుగులో రిలీజ్ అవుతుందా లేదానే దాని మీద పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. తమిళనాడు రిజల్ట్ చూశాక ఇక్కడ ఆదరించడం మీద డౌట్ రావడంలో తప్పేం లేదు. గతంలోనూ కొన్ని కార్తీ సినిమాలు ఇలాగే అనువాదం అయ్యాక విడుదల కాకుండా ఆగిపోయాయి.

మద్రాస్, పరుత్తి వీరన్, కొంబన్, బ్యాడ్ బాయ్ ఇప్పడు కనీసం ఓటిటిలో కూడా లేనంతగా మాయమైపోయాయి. మరి అన్నగారు వస్తారు థియేటర్లకు వస్తుందో లేక భవిష్యత్తు ఊహించి ఆగిపోతుందో వెయిట్ చేసి చూడాలి. పది కోట్లకే ఆపసోపాలు పడిన వా వతియార్ మరి అన్నగారు రూపంలో దర్శనం ఇస్తుందో లేదో వెయిట్ అండ్ సీ.

This post was last modified on January 21, 2026 1:16 pm

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

17 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

50 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago