Movie News

సీక్వెల్ బ‌డ్జెట్ 15 రెట్లు పెరిగింద‌ట‌

ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తున్న‌పుడు బ‌డ్జెట్ పెర‌గ‌డం స‌హ‌జ‌మే. కానీ ఆ బ‌డ్జెట్ మ‌రీ 15 రెట్లు పెరగ‌డం అంటే అనూహ్య‌మే. అందులోనూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా విజ‌యం సాధించ‌ని సినిమాకు సీక్వెల్ తీస్తూ.. బ‌డ్జెట్‌ను 14-15 రెట్లు పెంచారంటే అదొక సంచ‌ల‌నం అనే చెప్పాలి. త‌రుణ్ భాస్క‌ర్ కొత్త సినిమా ఈ న‌గ‌రానికి ఏమైంది-2 విష‌యంలో ఇదే జ‌రిగింద‌ని అంటున్నాడు నిర్మాత సృజ‌న్ య‌ర‌బోలు.

35:చిన్న క‌థ కాదు చిత్రంతో సృజ‌న్ నిర్మాత‌గా త‌న అభిరుచిని చాటుకున్నాడు. అత‌ను ప్ర‌స్తుతం ఈ న‌గ‌రానికి ఏమైంది-2 చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విశ్వ‌క్సేన్ స‌హా ఈ న‌గ‌రానికి ఏమైందిలో కీల‌క పాత్ర‌లు పోషించిన ముఖ్య న‌టీన‌టులంద‌రూ ఈ సినిమాలోనూ కొన‌సాగుతున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంది.

ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బ‌డ్జెట్ గురించి ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం చెప్పాడు సృజ‌న్. ఈ న‌గరానికి ఏమైందితో పోలిస్తే బ‌డ్జెట్ పెరిగిందా అని అడిగితే.. ఏకంగా 14, 15 రెట్లు అయింద‌ని వెల్ల‌డించాడు సృజ‌న్. ఈ న‌గ‌రానికి ఏమైంది థియేట‌ర్ల‌లో అనుకున్నంత‌గా ఆడ‌లేదు కానీ.. ఓటీటీలోకి వ‌చ్చాక దానికి మాంచి ఫాలోయింగ్ వ‌చ్చింది. కాల క్ర‌మంలో క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంది.

రెండేళ్ల ముందు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే అద్భుత‌మైన స్పంద‌న తెచ్చుకుంది. ఫ‌స్ట్ రిలీజ్ టైంలో కంటే ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేయ‌గానే బంప‌ర్ క్రేజ్ వ‌చ్చింది. ఈసారి సినిమాను లావిష్‌గా తీస్తున్న‌ట్లు సృజ‌న్ తెలిపాడు. ఈఎన్ఈ గ్యాంగ్ అంతా మ‌రోసారి సినిమా తీయ‌డం కోసం ప‌డే క‌ష్టాల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ని.. ఆ గ్యాంగ్ అల్ల‌రి అలా ఇలా ఉండ‌ద‌ని సృజ‌న్ చెప్పాడు.

ఈ సినిమాలో భారీగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయ‌ని.. అందుకే బ‌డ్జెట్ పెరిగింద‌ని అత‌ను తెలిపాడు. ఈ సినిమాకు మంచి బ‌జ్ ఉన్న‌ప్ప‌టికీ డిజిట‌ల్ రైట్స్ అమ్మ‌కంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్న‌ట్లు చెప్పాడు సృజ‌న్. ఓటీటీల‌ను సంప్ర‌దిస్తే త‌మ ద‌గ్గ‌ర స్లాట్స్ లేవ‌ని అంటున్నారంటూ.. డిజిట‌ల్ మార్కెట్ డౌన్ అయిన విష‌యాన్ని గుర్తు చేశాడు సృజ‌న్.

This post was last modified on January 21, 2026 8:48 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

1 hour ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago