Movie News

డబుల్ ట్రీట్ ఇవ్వనున్న శర్వానంద్

నారి నారి నడుమ మురారి సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న శర్వానంద్ మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ తనకు వర్కౌటయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు. అందులోనూ ఈసారి మన శంకరవరప్రసాద్ గారు లాంటి బ్లాక్ బస్టర్, అనగనగా ఒక రాజు లాంటి సూపర్ హిట్ ఎదురుగా పెట్టుకుని మరీ హిట్టు కొట్టడం మాములు విషయం కాదు.

చాలా ఏరియాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తిని డామినేట్ చేసేలా హౌస్ ఫుల్స్ పెట్టడమంటే శర్వా ఘనతని చిన్నదిగా చూడలేం. టికెట్ రేట్లు పెంచకుండా ఏపీ తెలంగాణలో మాములు ధరలు ఫాలో అయిన ఒకే ఒక్క సినిమా నారి నారి నడుమ మురారి. దీని సంగతలా ఉంచి ఇక అసలు విషయానికి వద్దాం.

శర్వానంద్ నెక్స్ట్ సినిమా బైకర్ విడుదలకు రెడీగా ఉంది, బైక్ రేసింగ్ నేపథ్యంలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్ థ్రిల్లర్ లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఇందులో శర్వానంద్ డ్యూయల్ రోల్స్ చేశాడు. ఈ విషయం తాజాగా శర్వానే పంచుకున్నాడు.

తండ్రి కొడుకులుగా రెండు టైం ఫ్రేమ్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. ఎమోషనల్ గా ఈ ట్రాక్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఏ రేంజ్ అనేది ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం కానీ శర్వా కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇదే అవుతుందని అంటున్నారు. ఎలా అంటే నాని జెర్సీ రేంజ్ లో ఊరిస్తున్నారు.

రిలీజ్ డేట్ విషయంలో యువి క్రియేషన్స్ మల్లగుల్లాలు పడుతోంది. ఒకవేళ మార్చి 27 పెద్ది రాని పక్షంలో ఆ స్లాట్ ని తీసుకునేందుకు బైకర్ ని సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. ఎలాగూ ప్యారడైజ్ వచ్చే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. మార్చి 19 దురంధర్ 2, టాక్సిక్, డెకాయిట్ ఉన్నప్పటికీ పెద్ది మిస్ అయితే మాత్రం ఆ అవకాశం బైకర్ అందుకోవచ్చని ఒక టాక్.

ఇప్పటికి ఇదంతా చర్చల దశలోనే ఉంది. నారి నారి నడుమ మురారి ఫైనల్ రన్ పూర్తయ్యాక బైకర్ కు సంబంధించి అప్డేట్స్, ప్రమోషన్స్ మొదలుపెడతారు. ఐమాక్స్, 3డి, 4డిఎక్స్ తదితర స్పెషల్ వెర్షన్లలో బైకర్ సిద్ధం చేయనుండటం గమనార్షం.

This post was last modified on January 20, 2026 10:25 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వర ప్రసాద్ గారు… అందరి రేట్లు పెరిగినట్లే

సంక్రాంతి బరిలో నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డ్ కలెక్షన్లు మేకర్స్ కి మంచి బూస్ట్…

2 hours ago

లోకేష్ పుట్టిన రోజు.. ఓ మంచి పని

టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈ నెల…

2 hours ago

90 రోజుల కండీషన్ – టాలీవుడ్ టెన్షన్ టెన్షన్

టాలీవుడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించిన చర్చే కనిపిస్తోంది. ఇకపై రాష్ట్రంలో టికెట్ ధరలు…

2 hours ago

సూర్య దుల్కర్ భలే తప్పించుకున్నారు

పొంగల్ పండగ సందర్భంగా సెన్సార్ వివాదాలను ఎదురుకుని తమిళంలో విడుదలైన పరాశక్తి ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. పేరుకు వంద…

3 hours ago

ఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది.…

3 hours ago

ప్రపంచ కుబేరులు… రాజకీయాలను శాసిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం…

3 hours ago