Movie News

మెగా హీరోతో మారుతీ ?

కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ త‌ర్వాత మిడ్ రేంజ్ చిత్రాల‌కు ఎదిగాడు. నాని, వెంక‌టేష్‌, గోపీచంద్ లాంటి హీరోల‌తో ఓ మోస్త‌రు బ‌డ్జెట్ల‌లో సినిమాలు తీశాడు. అలాంటి ట్రాక్ రికార్డున్న అత‌డికి ఒకేసారి ప్ర‌భాస్‌తో రూ.400 కోట్ల సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది.

ఐతే వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన రాజాసాబ్ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ మాదిరిగా ఆడిందంతే. ప్ర‌భాస్ ఎంతో న‌మ్మ‌కంతో ఇచ్చిన అవ‌కాశాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయిన మారుతి.. త‌న త‌ర్వాతి చిత్రాన్ని ఎవ‌రితో చేస్తార‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.

ఐతే మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో మారుతి సినిమా చేయ‌బోతున్న‌ట్లుగా ఇటీవ‌ల ప్రచారం మొద‌లైంది. వీరి క‌ల‌యిక‌లో కామెడీ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ ప్ర‌చారాన్ని మారుతి స‌న్నిహిత వ‌ర్గాలు ఖండించాయి.

మారుతి కొత్త సినిమా గురించి జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని.. త‌న త‌ర్వాతి ప్రాజెక్టు ఇంకా ఖ‌రారు కాలేద‌ని మీడియాకు స‌మాచారం ఇచ్చారు స‌న్నిహితులు. బ‌హుశా మారుతి ఇంకా త‌న కొత్త సినిమాకు క‌థ రెడీ చేసి ఉండ‌క‌పోవ‌చ్చు. స్క్రిప్టు రెడీ అయ్యాకే దానికి త‌గ్గ హీరోను ఎంచుకోవాల‌ని భావిస్తుండొచ్చు.

రాజాసాబ్ లాంటి భారీ చిత్రం త‌ర్వాత మ‌ళ్లీ పెద్ద సినిమానే తీయాల‌నేమీ తాను ఫిక్స్ కాలేద‌ని.. ఆ స‌మ‌యంలో ఏ క‌థ క‌రెక్ట్ అనిపిస్తే అది చేస్తాన‌ని.. చిన్న సినిమా చేయ‌డానికి కూడా తాను సిద్ధ‌మే అని మారుతి ఇంత‌కుముందు స్ప‌ష్టం చేశాడు. ఇప్పుడ‌త‌ను బ‌ల‌మైన స్క్రిప్టుతో రంగంలోకి దిగాల్సిందే.

మారుతి బ‌లం కామెడీ. కానీ రాజాసాబ్‌లో ఆ బ‌లాన్ని అత‌ను చూపించ‌లేక‌పోయాడు. ఫ‌స్టాఫ్‌లో కామెడీ వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో సినిమా దెబ్బ తింది. కాబ‌ట్టి ఈసారి త‌న ఫ‌న్ ప‌వ‌ర్ చూపించి మంచి ఎంట‌ర్టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడేమో చూడాలి. అత‌డి కొత్త సినిమా గురించి అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే.

This post was last modified on January 20, 2026 8:23 pm

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

41 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

2 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

3 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

3 hours ago