సినిమాలు సమాజం మీద ఎంతగా ప్రభావం చూపుతాయో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ప్రభావం మంచిగానూ ఉండొచ్చు. అలాగే చెడుగానూ ఉండొచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూసి ఒక జంట విడాకుల నిర్ణయాన్ని రద్దు చేసుకున్న విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే వెల్లడించారు. ఇలాంటి మరెన్నో మంచి ఉదాహరణలను వింటుంటారు.
గత ఏడాది గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలనం రేపిన ‘లాలో కృష్ణ సదా’ చిత్రం చూసి పలువురు ఆత్మహత్య ఆలోచనలను వెనక్కి తీసుకున్నట్లు దాని దర్శకుడు అంకిత్ సఖియా తాజాగా వెల్లడించాడు. చిన్న బడ్జెట్లో తక్కువ క్యారెక్టర్లతో సింగిల్ లొకేషన్లో తీర్చిదిద్దిన ఈ చిత్రం ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గుజరాతీ సినిమాల స్థాయికి అది చాలా పెద్ద నంబర్. ఆ పరిశ్రమలో అదే తొలి వంద కోట్ల సినిమా కావడం విశేషం.
ఒక ఆటోరిక్షా డ్రైవర్ అనుకోకుండా ఒక ఫార్మ్ హౌస్‌లో ఇరుక్కుపోవడం.. అతణ్ని ఒక చేదు గతం వెంటాడడం.. ఈ సమయం కృష్ణ భగవానుడు అతడికి చేయూతనిచ్చి తన సమస్యలన్నీ పరిష్కరించి మంచి మార్గంలో నడిచేలా చేయడం.. ఇదీ ‘లాలో కృష్ణ సదా’ కథ. ఇందులో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. ఒకే లొకేషన్లో కథ నడుస్తుంది. అయినా బోర్ కొట్టించకుండా, ఎంతో హృద్యంగా సాగిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
సినిమా రిలీజైన కొత్తలో థియేటర్లలో జనాలే లేరు. కానీ మౌత్ టాక్ పెరిగి సినిమా ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. ఈ సినిమాను మరింతమందికి చేరువ చేయాలని హిందీలోనూ ఇటీవల రిలీజ్ చేశారు. అక్కడా మంచి స్పందన వస్తోంది.
ఈ సినిమా జనాలను ఏ రకంగా కదిలించిందో దర్శకుడు అంకిత్ సఖియా వెల్లడించాడు.
ఎంతోమంది థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నారని.. అలాగే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పలువురు ఈ చిత్రం చూశాక ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తనతో చెప్పారని అతను తెలిపాడు. విష్ణు అనే ఒక ప్రేక్షకుడు తనకు సినిమా చాలా నచ్చిందంటూ భావోద్వేగంతో 5 వేల రూపాయలను తనకు బహుమతిగా ఇవ్వడం మరిచిపోలేని అనుభూతిగా చెప్పాడు అంకిత్.
This post was last modified on January 20, 2026 4:22 pm
కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ తర్వాత మిడ్ రేంజ్ చిత్రాలకు ఎదిగాడు.…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు నేడు సిట్ విచారణకు హాజరైన సంగతి…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడైన రజినీకాంత్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ ఆశిస్తాడు. ఒకసారి…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి…
సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో…
నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ…