Movie News

రజినీని వదిలేసి… విశాల్‌తో వెళ్తున్నాడు

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో ఒకడైన రజినీకాంత్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ ఆశిస్తాడు. ఒకసారి పని చేశాక రెండోసారి అవకాశం వచ్చినా వదలడు. కానీ తమిళ సీనియర్ దర్శకుడు సుందర్ మాత్రం.. రజినీతో సినిమాను వదులుకుని వెళ్లిపోయాడు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అరుణాచలం’ పెద్ద హిట్టయింది.

మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది చివర్లో సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు సుందర్. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సింది. ఘనంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు కానీ.. కొన్ని రోజులకే సుందర్ ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేసి పెద్ద షాకిచ్చారు. వాస్తవంగా రజినీ, కమల్, సుందర్ మధ్య ఏం జరిగిందో కానీ.. ఈ ప్రాజెక్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన కొన్నిరోజులకే తన కొత్త సినిమా గురించి త్వరలో ప్రకటిస్తానని చెప్పాడు సుందర్. ఇప్పుడు తన తర్వాతి చిత్ర కథానాయకుడెవరో చెప్పేశాడు. యాక్షన్ హీరో విశాల్‌తో అతను జట్టు కట్టబోతున్నాడు. వీరి కలయికలో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. చాలా ఏళ్ల పాటు మరుగున పడ్డ ‘మదగజ రాజా’ గత సంక్రాంతికి విడుదలై అనూహ్యంగా సూపర్ హిట్ అయింది.

ఆ చిత్రానికి సంగీతం అందించిన హిప్ హాప్ తమిళనే విశాల్, సుందర్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త చిత్రానికి కూడా మ్యూజిక్ చేయబోతున్నాడు. విశాల్, సుందర్, తమిళ కలిసి ఒక ఫన్నీ వీడియోతో సినిమాను ప్రకటించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సుందర్ సతీమణి ఖుష్బు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. సుందర్ ఇప్పటికే నయనతారతో ‘మూకుత్తి అమ్మన్-2’ సినిమాను పూర్తి చేశాడు. విశాల్‌తో ఆయన చేయబోయేది ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనరట.

This post was last modified on January 20, 2026 3:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మెగా హీరోతో మారుతీ ?

కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ త‌ర్వాత మిడ్ రేంజ్ చిత్రాల‌కు ఎదిగాడు.…

10 minutes ago

సినిమా చూసి ఆత్మహత్యలకు బ్రేక్

సినిమాలు సమాజం మీద ఎంతగా ప్రభావం చూపుతాయో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ప్రభావం మంచిగానూ ఉండొచ్చు. అలాగే చెడుగానూ…

15 minutes ago

‘రేవంత్ కి దమ్ముంటే విచారణ వీడియో బయట పెట్టాలి’

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు నేడు సిట్ విచారణకు హాజరైన సంగతి…

40 minutes ago

నాడు జగన్ నేడు కేటీఆర్… సేమ్ టు సేమ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి…

2 hours ago

ఇక్కడ 700 కోట్లు… అక్కడ 100 కోట్లే

సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో…

3 hours ago

జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది కానీ…

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ…

3 hours ago