టాలీవుడ్ లో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ తమ భుజాల మీద సినిమాను మోసి నిలబెట్టే వాళ్ళను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ఇప్పుడీ టాప్ 5 లిస్టులో ఖచ్చితంగా గుర్తుకు వచ్చే పేరు నరేష్.
ఒకప్పుడు హీరోగా కామెడీ చిత్రాలతో స్టార్ డం సంపాదించుకున్న నరేష్ తొంబై దశకంలో చిత్రం భళారే విచిత్రం, బావా బావా పన్నీరు, జంబలకిడిపంబ, పోలీస్ భార్య, హైహై నాయక లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో తనదైన ముద్ర వేశారు. తర్వాత క్రమంగా సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయి మోస్ట్ బిజీగా ఆర్టిస్టుగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఇటీవలే విడుదలైన నారి నారి నడుమ మురారిలో శర్వానంద్, ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నప్పటికీ నరేష్ టైమింగ్ థియేటర్లలో విపరీతమైన నవ్వులు పూయించింది. తాత వయసులో పెళ్లి చేసుకున్న యువకుడిగా ఆయన మీద రాసుకున్న జోకులు ఓ రేంజ్ లో పేలాయి.
అంతకు ముందు సామజవరగమన, కె ర్యాంప్ లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో వాటికి బలమయ్యారు. పర్సనల్ లైఫ్ నే ‘మళ్ళీ పెళ్లి’ పేరుతో సినిమాగా తీయడం నరేష్ కే చెల్లింది. ఇప్పుడు శుభకృత్ నామ సంవత్సరంతో సోలో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాగుబోతు పాత్రలో గెటప్, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి.
నరేష్ సమకాలీకులు రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి వాళ్ళు కూడా బిజీగా ఉన్నప్పటికీ నరేష్ తరహా దూకుడు వాళ్లలో అంతగా కనిపించదు. కేవలం హాస్య పాత్రలే కాదు ఎమోషనల్ గానూ తన సత్తా ఏమిటనేది రంగస్థలం, అందరి బంధువయా లాంటి సినిమాల్లో నరేష్ ఆల్రెడీ చూపించారు.
ఖరీదైన లైఫ్ స్టైల్ మైంటైన్ చేసే నరేశ్ విజయకృష్ణ 65 వయసులోనూ ఇంత చలాకీగా ఉండటం విశేషమే. అందులోనూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ, తన సినిమాల ఈవెంట్లు ఏవున్నా సరే, మిస్ కాకుండా పాల్గొని వాటిని వీలైనంత మేరకు పుష్ చేయడం నరేష్ వైపు నిర్మాతలకు కలిగే మరో పెద్ద ప్రయోజనం.
This post was last modified on January 20, 2026 2:27 pm
సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో…
నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ…
ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సినిమాలను అల్లు అర్జున్ కొనియాడడం పెద్ద విశేషంగా అనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో…
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో…
కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం…
టాలీవుడ్ కోరుకున్న శుభారంభం 2026కి దొరికేసింది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో నాలుగు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాక మన శంకరవరప్రసాద్…