Movie News

ఇండస్ట్రీలో మరో 100 కోట్ల హీరో

టాలీవుడ్లో కొందరు హీరోలు రాశి కన్నా వాసి ముఖ్యం అని భావిస్తారు. వెంటవెంటనే సినిమాలు చేయాలని వాళ్లు తొందరపడరు. తమ సినిమాల రైటింగ్‌లోనూ ఇన్వాల్వ్ అయి.. నెమ్మదిగా స్క్రిప్టు పని కానిస్తారు. మేకింగ్ కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. టైం తీసుకుని ప్రమోషన్లూ చేస్తారు. ప్రేక్షకులకు మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ అందించి.. సక్సెస్ అందుకుంటారు.

అడివి శేష్ ఇప్పటికే ఇలాంటి గుర్తింపు సంపాదించగా.. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి సైతం అదే బాటలో సాగుతున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసిన నవీన్.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఘనవిజయాన్నందుకున్నాడు.

ఆ తర్వాత ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాలతోనూ సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించాడు. ఈ చిత్రాలన్నింటి మధ్య అతను కావాల్సినంత గ్యాప్ తీసుకున్నాడు. చివరికి బెస్ట్ ఔట్ పుట్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ‘అనగనగా ఒక రాజు’తో నవీన్ తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

తొలిసారిగా నవీన్ కథ, స్క్రీన్ ప్లే, మాటల విషయంలో అఫీషియల్‌గా క్రెడిట్ తీసుకున్న సినిమా ఇది. చిన్మయి ఘాట్రాజు అనే రైటర్‌తో కలిసి ఈ సినిమా స్క్రిప్టు రాశాడు నవీన్. రైటర్‌గానే కాక నటుడిగానూ అతడికి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో అనడంలో సందేహం లేదు.

సంక్రాంతి కానుకగా రిలీజై రోజు రోజుకూ వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లిన ‘అనగనగా ఒక రాజు’ ఇప్పుడు అద్భుతమైన ఘనతను అందుకుంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును అందుకున్నాయి. నవీన్ రేంజికి ఇది చాలా పెద్ద నంబరే.

ఇన్నాళ్లూ అతణ్ని చిన్న హీరోగా చూస్తూ వచ్చారు కానీ.. ఇప్పుడతను మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగినట్లే. ఆ లీగ్‌లో విజయ్ దేవరకొండ, నాని, సిద్ధు జొన్నలగడ్డ, నాగచైతన్య లాంటి యంగ్ హీరోలు వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టారు. ఇప్పుడు నవీన్ వారి సరసన చేరాడు. ఇకపై తన సినిమాల బడ్జెట్, బిజినెస్ లెక్కలే వేరుగా ఉండబోతున్నాయన్నది స్పష్టం.

This post was last modified on January 19, 2026 9:45 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago