Movie News

పుష్పలో మిస్సయ్యింది కుటుంబంలో దొరికింది

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో వెనుకబడి ఉన్న నారా రోహిత్ ఆ మధ్య భైరవంలో చెప్పుకోదగ్గ పాత్ర చేశాడు కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. సుందరకాండలో హీరోగా ఒక డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తే అదీ ఆదరణకు నోచుకోలేదు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ పుష్పలో ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ తనకే వచ్చిందని, కాకపోతే పలు కారణాల వల్ల మిస్ అయ్యానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ చేసి ఉంటే రోహిత్ కి అది ఇంకోలా బ్రేక్ ఇచ్చి ఇతర భాషల్లోనూ ఆఫర్లు తీసుకొచ్చేదేమో. అది ఫాహద్ ఫాసిల్ పేరు మీద రాసి పెట్టినప్పుడు ఎవరైనా ఏం చేయగలరు.

ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబంలో నెగటివ్ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రను నారా రోహిత్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ యూనిట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం విశ్వసనీయంగా ఉంది.

అంటే పుష్పలో మిస్సయిన విలన్ పోలీస్ వేషం ఇప్పుడు ఆదర్శ కుటుంబంలో దొరికిందన్న మాట. ఎంటర్ టైన్మెంట్, క్రైమ్ రెండు మిక్స్ చేసిన ఒక ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ని త్రివిక్రమ్ తీస్తున్నారట. అందులో రోహిత్ చేస్తున్న క్యారెక్టర్ చాలా ప్రాధాన్యం ఉన్నట్టుగా చెబుతున్నారు.

ఇది కనక సక్సెస్ అయితే రోహిత్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ చూడొచ్చు. ప్రస్తుతం కీలక షెడ్యూల్ లో ఉన్న ఆదర్శ కుటుంబంని వేసవి విడుదలకు రెడీ చేస్తున్నారు. వేగంగా తీస్తున్నా సరే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా బెస్ట్ ఎంటర్ టైనర్ అయితే వస్తుందట.

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు డైలాగ్ రైటర్ గా వాటి విజయంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్ దశాబ్దాల తర్వాత వెంకటేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. దీని తర్వాత తారక్ తో ప్యాన్ ఇండియా మూవీ ప్లానింగ్ లో ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా విడుదల చేసుకుంటే ఆ ప్రాజెక్టుకి మార్గం సుగమం అవుతుంది.

This post was last modified on January 19, 2026 7:06 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nara Rohit

Recent Posts

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు షాక్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పలువురు రాజకీయ…

22 minutes ago

‘దావోస్ మ్యాన్ చంద్రబాబు’… సీఎంకు ప్ర‌శంస‌!

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు జ్యూరిచ్‌లో బిజీ బిజీగా గ‌డిపారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లా…

24 minutes ago

కమెడియన్ సత్యకు దశ తిరిగింది

ఒకప్పటిలా టాలీవుడ్ లో హాస్య నటుల స్వర్ణ యుగం లేదన్నది వాస్తవం. తొంభై దశకంలో బ్రహ్మానందం, బాబు మోహన్, మల్లికార్జునరావు,…

3 hours ago

ట్రెండ్ గమనించండి వరప్రసాద్ గారూ

రికార్డులను బద్దలు కొడుతున్న మన శంకరవరప్రసాద్ గారు మొదటి వారం గడవడం ఆలస్యం ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్…

3 hours ago

బాబు సింగపూర్ లో దిగడమే ఆలస్యం…

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మార్గం మ‌ధ్య‌లో జ్యురిచ్‌లో ఆగారు. షెడ్యూల్‌లో భాగంగా జ్యూరిచ్‌లోనూ ప‌లు కార్య‌క్ర‌మాల్లో…

4 hours ago

మెగా అభిమానులు… ఉక్కిరి బిక్కిరే

మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది.…

6 hours ago