సాయి పల్లవి ఒక సినిమా సైన్ చేయాలంటే అంత ఆషామాషీ విషయం కాదని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ వుంటారు. అయితే ఆ పద్ధతిని ఆమె మార్చేసుకుందట. వచ్చిన ప్రతి అవకాశాన్నీ జారవిడుచుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని గ్రహించిన సాయి పల్లవి ఇప్పుడు పాత్రల ఎంపికలో పట్టు విడుపులు చూపిస్తోందట. అయితే తనకున్న డిమాండ్ ఎలాంటిది, ఇండస్ట్రీలో తాను మాత్రమే చేయగల పాత్రలు ఎన్ని వున్నాయనేది ఆమె కనిపెట్టేసిందట. అందుకే నిర్మాతలు తనను అప్రోచ్ అయితే చేయనని చెప్పకుండా భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందట.
సినిమాలో తన పాత్ర నిడివి ఎంత, ఎన్ని రోజులు పని చేయాలనేది కాకుండా తనకింత కావాలంటూ నిర్మొహమాటంగా చెబుతోందట. అంత పారితోషికం ఇవ్వగలిగిన వాళ్లకే ఆమె డేట్స్ ఇస్తోందట. తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలు నటించే వాటిలో ఎక్కువగా గ్లామర్ ప్రధాన హీరోయిన్ పాత్రలే వుంటాయి. అలాంటివాటికి సాయి పల్లవిని ఎలాగో అప్రోచ్ అవలేరు. కానీ నటిగా తాను మాత్రమే చేయగల పాత్రలయితే వుంటూనే వుంటాయి. అందుకే ఆ స్పేస్‍లో ఎక్కువ మంది లేని లోటుని ఆమె ఫుల్‍గా క్యాష్ చేసుకుంటోందని టాలీవుడ్‍లో వినిపిస్తోన్న టాక్.
This post was last modified on December 14, 2020 9:08 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…