తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పట్నుంచో హైదరాబాద్ కేంద్రంగా ఉంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా ఇండస్ట్రీకి హైదరాబాదే కేంద్రం. ఐతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ను కూడా షూటింగ్‌ల కోసం ఉపయోగించుకోవాలని, అవసరమైన ప్రోత్సాహాలన్నీ అందిస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి.
కానీ ఒకప్పట్లా రియల్ లొకేషన్లలో సినిమాలు తీయడం తగ్గిపోవడంతో ఏపీలో అనుకున్నంత మేర చిత్రీకరణలు జరగట్లేదు. ఐతే ఇటీవల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీలో షూటింగ్స్ పెంచే ప్రయత్నం జరుగుతోంది. సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం షూటింగ్ చాలా వరకు ఏపీలోని గోదావరి ప్రాంతంలోనే జరిగింది.
ఇందుకు పవన్ కళ్యాణ్ మాటలే స్ఫూర్తి అని అంటున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. ఏపీలో ఎక్కువగా షూటింగ్స్ జరగాలంటూ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్‌లో చెప్పిన మాటలు తన మనసుకు హత్తుకున్నాయని నవీన్ చెప్పాడు. అందుకే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ భాగం షూటింగ్ చేశామని అతనన్నాడు.
తమ సినిమాకు ఎక్కడ షూటింగ్ జరిగినా అధికారులు సులువుగా అనుమతులు ఇచ్చేశారని.. ఎంతో సహకరరించారని.. స్థానికులు కూడా బాగా సహకరించారని నవీన్ తెలిపాడు. నవీన్‌లాగే టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు పవన్ మాటలను ఆలకించి.. అనుసరించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్రతి సినిమాకూ అక్కడికి వెళ్లాలని కాదు కానీ.. కథ ప్రకారం ఏపీలో చిత్రీకరించాల్సి వచ్చినపుడు రియల్ లొకేషన్లను ఎంచుకోవడం వల్ల సినిమాకు ఒక అథెంటిసిటీ వస్తుంది. రియల్ లొకేషన్లలో చిత్రీకరణ కొంచెం కష్టమే అయినప్పటికీ.. సరైన ప్లానింగ్, జాగ్రత్తలతో షూటింగ్స్ ప్లాన్ చేస్తే ఒరిజినల్ క్వాలిటీ కనిపిస్తుంది. అలాగే బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఈ దిశగా టాలీవుడ్ నిర్మాతలు సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరముంది.
This post was last modified on January 19, 2026 12:20 pm
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…