Movie News

‘భారీ’ గాయాలకు… ‘చిన్న’ సినిమాల మందు

ఒకప్పుడు 14 రీల్స్ సంస్థలో భాగస్వామిగా నమో వెంకటేశ, దూకుడు, 1 నేనొక్కడినే లాంటి భారీ చిత్రాలు నిర్మించారు అనిల్ సుంకర. ఆ సంస్థలో కొనసాగుతూనే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేసేవారు. కానీ తర్వాత ఆయన 14 రీల్స్ నుంచి బయటికి వచ్చారు. ఏకే బేనర్లోనే సినిమాలు తీయడం కొనసాగించారు. ఐతే అంతకుముందులా ఈ సంస్థ చిన్న సినిమాలకు పరిమితం కాలేదు. పెద్ద సినిమాలను నెత్తికెత్తుకుంది. 

కానీ అవి అనిల్ సుంకరను దారుణంగా దెబ్బ కొట్టాయి. శర్వానంద్, సిద్దార్థ కలయికలో వారి మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టి తీసిన ‘మహాసముద్రం’ అనిల్‌కు పెద్ద షాక్. అది చాలదన్నట్లుగా ఆ తర్వాత అఖిల్‌తో తీసిన ‘ఏజెంట్’, మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ అనిల్‌ కొంప ముంచాయి. ఈ మూడు చిత్రాలు కలిపితే ఓ వంద కోట్లయినా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఇలాంటి ఎదురు దెబ్బల తర్వాత కూడా ఓ నిర్మాత ఇండస్ట్రీలో నిలబడడం అంటే గొప్ప విషయమే.

కానీ అనిల్ సుంకర మాత్రం ధైర్యంగానే పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఐతే పెద్ద సినిమాలు అనిల్‌ను దారుణమైన దెబ్బ కొడుతున్నప్పటికీ.. చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలు మాత్రం ఆయనకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కొన్నేళ్ల ముందు ఆయన శ్రీ విష్ణుతో ‘సామజవరగమన’ తీశారు. అది అనిల్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. గత ఏడాది సందీప్ కిషన్‌తో చేసిన ‘మజాకా’ హిట్ కాకపోయినా.. తక్కువ బడ్జెట్లో తీసి, బాగా బిజినెస్ చేయడం వల్ల కొంతమేర లాభాలు వచ్చాయి.

తాజాగా అనిల్ ‘నారీ నారీ నడుమ మురారి’తో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంటున్నారు. పరిమిత బడ్జెట్లో తీసిన ఈ చిత్రం.. సైలెంటుగా సంక్రాంతి రేసులోకి వచ్చింది. పెద్దగా బజ్ లేకపోయినా మంచి టాక్ రావడం, సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో భారీ లాభాల దిశగా దూసుకెళ్తోంది శర్వా సినిమా. ఈ చిత్రం అనిల్‌కు భారీ లాభాలే అందించేలా ఉంది. ఈ చిత్రం పెట్టుబడి మీద రెండు మూడు రెట్ల ఆదాయం తెచ్చిపెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.

This post was last modified on January 19, 2026 8:53 am

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

31 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago