కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఇటీవలే తమిళంలో విడుదలయ్యింది. జన నాయకుడు వాయిదాని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఆఘమేఘాల మీద రిలీజ్ చేసిన నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ క్రమంలో చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఆర్థిక లావాదేవీల విషయంలో కోర్టు ప్రమేయం వల్ల అప్పులు తీర్చాల్సి వచ్చినా సినిమా హిట్ అయితే చాలనుకున్నారు.
కానీ వా వతియార్ కు ఆశించిన స్పందన రాలేదని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటిదాకా పట్టుమని పది కోట్లు కూడా వసూలు కానీ వైనం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎంత ఫ్లాప్ అయినా పొంగల్ సీజన్ వల్ల కార్తీకి పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందనుకున్నారు.
కానీ జరిగింది వేరు. కథ పరంగా లెజెండరీ నటులు ఎంజిఆర్ స్ఫూర్తిని స్టోరీలో జొప్పించినప్పటికీ కొత్త జనరేషన్ కు ఆ పాయింట్ అంతగా కనెక్ట్ కాలేదు. విచిత్రం ఏంటంటే ఇందులో కొంత జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ షేడ్స్ కూడా ఉంటాయి. ఎంజీఆర్ చనిపోయిన రోజే పుట్టిన తన మనవడు రాము ఆయనంత గొప్పవాడు అవుతాడని తాత ఆశలు పెట్టుకుంటాడు.
కానీ తీరా చూస్తే పెద్దయ్యాక పోలీసైన రామ్ అవినీతికి అలవాటు పడి డబ్బు పోగేసుకుంటాడు. రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పరిస్థితుల వల్ల రాములో అనూహ్యమైన మార్పు వచ్చి వాళ్ళ భరతం పట్టేందుకు రెడీ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో గెస్ చేయొచ్చు.
దర్శకుడు నలన్ కుమారస్వామి ఏదో కొత్తగా ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు. విలన్ పాత్రలు మరీ పాత చింతకాయ పచ్చడి తరహాలో ఉండటం, సెకండాఫ్ ట్రీట్ మెంట్ పట్టాలు తప్పడం, హీరోయిన్ కృతి శెట్టి మొక్కుబడిగా మారిపోవడం లాంటి కారణాలు దెబ్బ కొట్టాయి. సంతోష్ నారాయణన్ సంగీతం కూడా మేజిక్ చేయలేకపోయింది.
పోటీలో వచ్చిన జీవా సినిమా దూసుకుపోతుండగా కార్తీ వెనుకబడ్డాడు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అన్నగారు వస్తారు సిద్ధంగా ఉంది కానీ విడుదల తేదీ నిర్ణయించలేదు. బహుశా వచ్చే వారం తెచ్చే ప్లాన్ ఉంది. అంతగా బజ్ లేని ఈ మూవీని కోలీవుడ్ రెస్పాండ్ తర్వాత ఇక్కడెలా ప్రమోట్ చేస్తారో చూడాలి.
This post was last modified on January 17, 2026 10:35 pm
సంక్రాంతి పండక్కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు అంతగా ఎందుకు పోటీ పడతారో.. ఈ సీజన్లో సినిమాలను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు…
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నాలుగు రోజుల దావోస్ పర్యటన ప్రారంభమవుతోంది. జనవరి…
రామ్ చరణ్ తాజా జిమ్ లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పూర్తిగా వర్కౌట్…
రాజధాని అమరావతి విషయంలో రెండో దశ భూ సమీకరణ వ్యవహారం ఒకింత ఇబ్బందిగా మారింది. కొందరు గతంలో భూములు ఇచ్చిన…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్…
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు…