తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత పడుతోంది. అదే సమయంలో కొత్త మల్టీప్లెక్సుల నిర్మాణం మాత్రం ఆగట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏటా కొత్త మల్టీప్లెక్సులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.
నగరంలో అరడజనుకు పైగా మల్టీప్లెక్సులు నిర్మాణంలో ఉండడం విశేషం. అందులో మూడింటిని ఈ సంక్రాంతికి ఆరంభిస్తారని ప్రచారం జరిగింది. పండక్కి కొత్త మల్టీప్లెక్సుల్లో సినిమాలు ఆయా ఏరియాల ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశారు. కానీ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించాయి వాటి యాజమాన్యాలు.
కోకాపేటలో అల్లు కుటుంబానికి చెందిన ‘అల్లు సినిమాస్’ గురించి కొన్ని రోజుల ముందు పెద్ద డిస్కషనే నడిచింది. అల్లు అర్జున్ కూడా హాజరై ఆ మల్టీప్లెక్స్ సాఫ్ట్ లాంచ్ కూడా పూర్తి చేశారు. ఇక పూర్తి స్థాయిలో ఈ మల్లీప్లెక్స్ అందుబాటులోకి రావడమే తరువాయి అనుకున్నారు. సంక్రాంతి సినిమాలతోనే ఇది ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.
75 అడుగులతో ఆసియాలోనే అతి పెద్ద దాల్బీ స్క్రీన్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో అందులో సంక్రాంతి సినిమాలు చూడాలని ఆడియన్స్ ఎంతో ఉత్సాహం చూపించారు. కానీ ఈ మల్టీప్లెక్స్ సంక్రాంతికి అందుబాటులోకి రాకపోవడంతో నిరాశ తప్పలేదు.
మరోవైపు హైదరాబాదీల ఫేవరెట్ సినిమా డెస్టినేషన్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రెండు మల్టీప్లెక్సులు నిర్మాణంలో ఉన్నాయి. గతంలో సుదర్శన్ 70 ఎంఎం ఉన్న చోట ఏఎంబీ సినిమాస్‌ను నిర్మిస్తున్నారు. దానికి ఎదురుగా ఒడియన్ థియేటర్లు ఉన్న చోట పీవీఆర్ వాళ్ల మల్టీప్లెక్స్ కడుస్తున్నారు.
ఇవి రెండూ సంక్రాంతికే అందుబాటులోకి వస్తాయని వార్తలు వచ్చాయి. చివరికి చూస్తే అవి కూడా సమయానికి పూర్తి కాలేదు. సంక్రాంతికి ఐదు కొత్త సినిమాలు రిలీజైన నేపథ్యంలో ఈ కొత్త మల్టీప్లెక్సులు రెడీ అయి ఉంటే సందడే వేరుగా ఉండేది. మళ్లీ వేసవి ఆరంభంలో కానీ బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి హంగామా ఉండదు. ఈలోపు వీటిని ఆరంభిస్తే సంక్రాంతి టైంలో ఉండే సందడిని చూడలేం.
This post was last modified on January 17, 2026 12:49 pm
కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.…
కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ల సమస్య వల్ల థియేటర్లు సరిపోకపోయినా, మరో నాలుగు సినిమాలతో స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చినా మన శంకరవరప్రసాద్…
ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి.…
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి…
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర…
సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ…