మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర మామూలు విధ్వంసం సాగించట్లేదు. ఇది సగటు ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినప్పటికీ.. చిరును వింటేజ్ స్టయిల్లో చూపించడం.. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సూటయ్యే ఎంటర్టైన్మెంట్ ఉండడం బాగా కలిసొచ్చి సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. రీఎంట్రీలో చిరును ది బెస్ట్‌గా చూపించిన చిత్రం ఇదే.
70 ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ తనదైన శైలిలో వేసిన స్టెప్పులు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. మెగా ఫ్యాన్స్ ఆ స్టెప్పులు చూసి మైమరిచిపోయారు. ఒకప్పటంత స్పీడు లేకపోయినా.. గ్రేస్ విషయంలో మాత్రం మెగాస్టార్ తన మార్కు చూపించారు. ముఖ్యంగా రిలీజ్ ముంగిట ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘హుక్ స్టెప్’ సినిమాకు మాంచి హైప్ తీసుకొచ్చింది. తెర మీదా ఈ స్టెప్ బాగా పేలింది. థియేటర్లలో సంబరాలు తీసుకొచ్చింది.
ఐతే ఈ హుక్ స్టెప్‌ను కంపోజ్ చేసిన ‘ఆట’ సందీప్‌తో పాటు కొరియోగ్రఫీ టీం మొత్తం.. ఈ డ్యాన్స్ మూమెంట్‌కు లీడ్ ఎలా ఇవ్వాలో తెలియక సెట్లో తలలు పట్టుకుందట. అందుకోసం రకరకాల స్టెప్స్ ట్రై చేసిందట. కానీ ఏదీ కుదరలేదట. వాళ్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని దూరం నుంచి చూస్తున్న చిరు.. తనే దగ్గరికి వచ్చి హుక్ స్టెప్‌కు ముందు లీడ్ ఎలా ఉండాలో తనే చేసి చూపించాడట. అది కొరియోగ్రాఫర్‌తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా బాగా నచ్చేసి దాన్నే ఫిక్స్ చేశారట.
అలా హుక్ స్టెప్‌కు ముందు చిరు మూమెంట్స్ అన్నీ ఆయనే స్వయంగా కంపోజ్ చేసుకున్నారట. దీని కోసం తాను రిహార్సల్స్ కూడా ఏమీ చేయలేదని.. అప్పటికప్పుడు అనిపించింది చేసేశానని.. ఒక్క టేక్‌లో అది ఓకే అయిపోయిందని చిరు.. అనిల్, వెంకటేష్‌లతో కలిసి చేసిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 70 ఏళ్ల వయసులోనూ డ్యాన్స్ విషయంలో చిరు ఎంత కేర్ తీసుకుంటున్నాడో తెలిసి అభిమానులు మెస్మరైజ్ అయిపోతున్నారు.
This post was last modified on January 17, 2026 12:39 pm
తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత…
కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.…
కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ల సమస్య వల్ల థియేటర్లు సరిపోకపోయినా, మరో నాలుగు సినిమాలతో స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చినా మన శంకరవరప్రసాద్…
ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి.…
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి…
సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ…