ఇంత పెద్ద కాంపిటీషన్, అందులోనూ మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. సరైన ప్లానింగ్ తో అనగనగా ఒక రాజు దాన్ని విజయవంతంగా చేసి చూపిస్తోంది. సితార సంస్థ చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ వల్ల థియేటర్ల పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చేసుకోవడంతో ఏపీ తెలంగాణతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి నెంబర్లు నమోదవుతున్నాయి.
యుఎస్ లో వన్ మిలియన్ మార్కుకి అతి దగ్గర్లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ యాభై కోట్లు దాటేందుకు పరుగులు పెడుతోంది. ఫైనల్ రన్ కు నిర్మాత నాగవంశీ టీమ్ సెంచరీ గ్రాస్ దాటేస్తుందని నమ్మకంగా ఉంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత యాక్సిడెంట్ లాంటి కారణాల వల్ల బాగా గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టికి పండగ టైమింగ్ బాగా కలిసి వచ్చింది. కథ పరంగా చూసుకుంటే యునానిమస్ అనిపించకపోయినా, నవ్వించడంలో టీమ్ పడిన కష్టం ఫలితం ఇవ్వడంతో కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతోంది.
కాకపోతే నవీన్ ఇంత గ్యాప్ తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఇకపై వేగం పెంచాల్సిన అవసరం అయితే ఉంది. అందులోనూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి యునీక్ సినిమాలతో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. నెక్స్ట్ అలాంటి ప్లానింగే ఉందని టాక్.
ఇక అనగనగా ఒక రాజుకి కాంపిటీషన్ పరంగా చూసుకుంటే నారి నారి నడుమ మురారి ఫ్రంట్ రేస్ లో ఉంది. రెండూ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నవి కావడంతో ప్రేక్షకులు వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే థియేటర్ కౌంట్ పరంగా నవీన్ పోలిశెట్టి ముందంజలో ఉండటంతో నెంబర్లు కూడా దానికి తగ్గట్టు పెద్దగా కనిపిస్తున్నాయి.
పండగ అయిపోయిన తర్వాత కూడా లాంగ్ రన్ ఉంటుందని నవీన్ నమ్మకంగా ఉన్నాడు. అయితే శిఖరంలాగా నిలబడ్డ మన శంకరవరప్రసాద్ గారు ముందు ఈ మాత్రం ఫీట్ సాధించడం ఖచ్చితంగా చెప్పుకోదగిన విశేషమే. సోమవారం నుంచి ఇదే జోరు ఉంటే బంపర్ హిట్టే.
This post was last modified on January 17, 2026 11:39 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…