భాషతో సంబంధం లేకుండా యూత్ లో మంచి వైబ్ ఉన్న పేరు ప్రదీప్ రంగనాథన్. 2026లో డ్రాగన్, డ్యూడ్ రూపంలో రెండు పెద్ద హిట్లు అందుకున్న ఈ కుర్రాడు ఇప్పట్లో ఆగేలా లేడు. ఫ్యాన్స్ ముద్దుగా జూనియర్ ధనుష్ అని పిలుచుకుంటారు.
ఇతని కొత్త మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ కోసం మల్లగుల్లాలు పడుతోంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ ఫాంటసీ మూవీలో ఎస్జె సూర్య ముఖ్య పాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇన్ని అట్రాక్షన్లు ఉన్నా ఏవో అంతర్గత కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ డైరెక్టర్ కాబోతున్నట్టు చెన్నై టాక్. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా ఒక డిఫరెంట్ సోషియో ఫాంటసీ సబ్జెక్టు రాసుకున్నాడట. జయం రవి హీరోగా తీసిన ఇతని డెబ్యూ మూవీ కోమలి ఎంత సక్సెస్ అయ్యిందో తెలిసిందే. తర్వాత లవ్ టుడేతో హీరోగా మారి తనను తాను డైరెక్ట్ చేసుకున్నాడు. ఇది ఇంకా పెద్ద హిట్టు.
తర్వాత మళ్ళీ మెగా ఫోన్ చేపట్టలేదు.ఇప్పుడు ఏజిఎస్ నిర్మించబోయే ఈ మూవీ దాదాపు లాకైనట్టేనని అంటున్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలోపు దీనికి సంబంధించిన అనౌన్స్ చేయొచ్చు.
ఇక శ్రీలీల విషయానికి వస్తే కథ నచ్చితే హిందీ, తమిళం అని చూడటం లేదు. ఒప్పేసుకుంటోంది. ప్రదీప్ రంగనాథన్ ఎలాగూ ట్రెండ్ లో ఉన్నాడు కాబట్టి తనతో చేస్తే మంచి బ్రేకే దక్కొచ్చు. ఏడాదిగా అనగనగా ఒక రాజుకి అంకితమైపోయిన మీనాక్షి చౌదరికి కూడా ఇది మంచి మలుపు అవుతుంది.
నువ్వు హీరో మెటీరియల్ కాదుగా అనే ప్రశ్నను మీడియాలో ఎదురుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డిమాండ్ ఉన్న గ్లామర్ హీరోయిన్లను తన సరసన నటించేలా చేయడంలో సక్సెసవుతున్నాడు. తెలుగులో ఒక స్ట్రెయిట్ మూవీ చేయాలని కోరిక ఉన్న ప్రదీప్ రంగనాథన్ త్వరలోనే దాన్ని తీర్చుకునే అవకాశాలు లేకపోలేదు.
This post was last modified on January 17, 2026 11:23 am
ఏ ప్రభుత్వమైనా పట్టు విడుపులు ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. అన్నీ చట్టం ప్రకారమే చేయాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి.…
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి…
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర…
సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ…
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన కలం కవల్ కేరళలో సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ లో వేగంగా…
సోషల్ మీడియాలో ఇటీవల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్లు, బైకులు,…