ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన శైలిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సినిమా తీసే దర్శకుల కోసం చూస్తుంటారు. ఆ హీరో కెరీర్లో ది బెస్ట్ అనిపించుకున్న సినిమాలను.. పెర్ఫామెన్సులను గుర్తు చేసేలా పాత్రలను క్రియేట్ చేసి.. తెరపై బాగా ప్రెజెంట్ చేస్తే ఫ్యాన్స్‌కు నోస్టాల్జిక్ ఫీల్ వస్తుంది. వారి ఆనందానికి అవధులు ఉండవు.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక చాలా సినిమాల్లో ఆయన బలాలను సరిగా వాడుకోలేకపోయారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. వింటేజ్ చిరును తెరపైకి తీసుకొచ్చి, అభిమానులను అమితానందానికి గురి చేసిన దర్శకుడంటే బాబీనే. ‘వాల్తేరు వీరయ్య’లో చిరు కామెడీ టైమింగ్‌ను అతను వాడుకున్న తీరు అభిమానులకు నచ్చింది. ఆ సినిమాలో అందరికీ వింటేజ్ చిరు ఛాయలు కనిపించాయి. ఐతే ‘వాల్తేరు వీరయ్య’లో బాబీ చూపించింది టీజర్ మాత్రమే. ఇప్పుడు అనిల్ ‘మన శంకర వరప్రసాద్ గారు’లో ఏకంగా ట్రైలరే వదిలాడు.
వింటేజ్ చిరును రీఎంట్రీలో అనిల్ కంటే బాగా ఇంకెవరూ వాడుకోలేదన్నది స్పష్టం. ఇకముందు కూడా చిరును ఇంత బాగా ఇంకొకరు ప్రెజెంట్ చేయగలరా అన్నది సందేహమే. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్.. ఇలా ఎన్నో చిరు బ్లాక్ బస్టర్ సినిమాల్లోంచి ఆయన కామెడీ టైమింగ్‌ను సరిగ్గా పట్టుకుని దాన్ని మళ్లీ అందంగా రీక్రియేట్ చేయడంలో అనిల్ విజయవంతం అయ్యాడు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ చూసి చిరు కామెడీ వర్కవుట్ అవుతుందా.. కెరీర్లో ఈ దశలో ఆయనకు టైమింగ్ కుదురుతుందా.. ఈ తరం ప్రేక్షకులను ఆయన మెప్పించగలరా అన్న సందేహాలు కలిగాయి కానీ.. సినిమా చూశాక ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. సినిమా అంతా మంచి ఫ్లోతో వెళ్లిపోయాడు చిరు.
తనదైన కామెడీ టైమింగ్‌తో నిన్నటితరం అభిమానులనే కాక.. ఈ తరం ప్రేక్షకులనూ ఆయన ఆకట్టుకుంటున్నారు. చిరు పాత సినిమాల మీద ఎంతో రీసెర్చ్ చేసి.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచిని కూడా దృష్టిలో ఉంచుకుని అనిల్ సన్నివేశాలను డిజైన్ చేసిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులైతే అనిల్‌ను మామూలుగా పొగడట్లేదు. థాంక్యూ అనిల్ రావిపూడి అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on January 13, 2026 2:24 pm
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…