మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్ హిట్ అయ్యింది. బయ్యర్లందరూ రెట్టింపు లాభాలతో గట్టెక్కారు. శివ కార్తికేయన్ కు దీంతోనే మంచి పునాది పడింది. మన ఫ్యామిలీ ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
ఎన్నో ఆశలు పెట్టుకుని మురుగదాస్ మదరాసీ చేస్తే దారుణంగా పోయింది. తమిళంలో కాసిన్ని డబ్బులు వచ్చాయి కానీ తెలుగులో వాషౌట్ అయ్యింది. ఇటీవలే తమిళంలో పొంగల్ పండక్కు సెన్సార్ అడ్డంకులు దాటుకుని పరాశక్తితో థియేటర్లలో అడుగు పెట్టాడు. కానీ అద్భుతాలు జరగలేదు.
జన నాయకుడు వాయిదా పడింది కాబట్టి పరాశక్తికి వసూళ్ల వర్షం కురుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ మొదలయ్యింది. అది కాస్తా నెగటివ్ గా మారిపోయింది. వసూళ్లు క్రమంగా తగ్గిపోవడం చూసి టీమ్ ఆందోళన చెందుతోంది.
ఇది అవకాశంగా తీసుకుని వేరే సినిమాలు హఠాత్తుగా రిలీజ్ డేట్లు ప్రకటించుకుని రేస్ లోకి వచ్చాయి. వాటిలో కార్తీ అన్నగారు వస్తారుతో పాటు జీవా కొత్త మూవీ ఉంది. ఇదంతా పరాశక్తికి ఇబ్బందిగా మారింది. శివాజీ గణేశన్ కల్ట్ టైటిల్ వాడుకుని పీరియాడిక్ డ్రామా చేస్తే ఇంత ప్రతికూల ఫలితం వస్తుందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.
ట్రాజెడీ ఏంటంటే హీరోగా మంచి ఇమేజ్ ఉన్నా దర్శకురాలు సుధా కొంగర మీద నమ్మకంతో రవి మోహన్ పరాశక్తిలో విలన్ గా నటించాడు. శ్రీలీల చాలా కాలం వెయిట్ చేసి కోలీవుడ్ డెబ్యూ కోసం దీన్ని ఎంచుకుంది. శివ కార్తికేయన్ ఫిజికల్ గా బాగా కష్టపడ్డాడు. ఇవన్నీ వృథా అయ్యాయి.
నిర్మాణం పెద్ద బడ్జెట్ తో జరిగింది. వేరే కాంబినేషన్ అనుకుని తర్వాత చేతులు మారిపోయి రెండేళ్లకు పైగా వెయిటింగ్ లో పరాశక్తికి చివరికి మిగిలింది ఫ్లాపేనని చెన్నై మీడియా కోడై కూస్తోంది. అయలన్ లాగా తెలుగు డబ్బింగ్ రాకుండా ఆగిపోతుందో లేక ధైర్యం చేసి ఇక్కడ రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.
This post was last modified on January 13, 2026 11:12 am
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…