తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపై టికెట్ల రేట్లు పెంచబోమని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఐతే ఇటీవల సంక్రాంతి సినిమాలకు మళ్లీ రేట్లు పెంచుతూ జీవోలు విడుదల చేశారు.
దీని గురించి ఇటీవల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ జీవోల గురించి తనకు తెలియదని.. రేట్ల పెంపుతో తన ప్రమేయం ఏమీ లేదని తేల్చేశారు కోమటిరెడ్డి. ఐతే దీని మీద బీఆరెస్ అగ్ర నేత హరీష్ రావు.. ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
సినిమాటో గ్రఫి మంత్రికి తెలియకుండా జీవోలు ఎవరు జారీ చేస్తున్నారు, ఇదేం ప్రభుత్వం అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. మంత్రి కోమటి రెడ్డి స్పందించారు. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి జీవోలతో తనకు సంబంధం లేదన్న గత వ్యాఖ్యలపై యుటర్న్ తీసుకున్నారు.
ఇటీవల రెండు, మూడు సినిమాల జీవోల సమయంలో తాను నల్గొండలో ఉన్నట్లు చెప్పారు. కాబట్టే ఆ జీవోల గురించి తనకు తెలియదని చెప్పానన్నారు. ఐతే రేవంత్ రెడ్డి, తాము కూర్చుని రేట్ల పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో సినిమా కార్మికులకు 20 శాతం ఇచ్చే విధంగా జీవోలను జారీ చేశామన్నారు.
సీఎం రేవంత్ ఏ శాఖలో తలదూర్చరని ఆయన స్పష్టం చేశారు. ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ..మంత్రులకు ఫ్రీ హ్యండ్ ఇస్తారన్నారు. హరీష్ రావును, బీఆరెస్ పార్టీని చూస్తే తనకు జాలేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఒక్క ఎంపీ సీటును గెలుచుకొలేకపోయారని, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కూడా బొక్కాబొర్లా పడ్డారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలుచేయడం బీఆర్ఎస్ కు అలవాటే అన్నారు. వారికి ఏ పనిపాటలేదని, తమకు చాలా పని ఉందని.. ఇంతకుముందు తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
This post was last modified on January 12, 2026 9:15 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…